AstraZeneca Booster : ఒమిక్రాన్‌పై ఆస్ట్రాజెనెకా బూస్టర్‌ ప్రభావంతం.. కొత్త అధ్యయనం

ప్రపంచాన్ని వణికిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్‌పై ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ప్రభావంతంగా పనిచేస్తోందని కొత్త అధ్యయనంలో తేలింది. ఆస్ట్రాజెనికా బూస్టర్ ఒమిక్రాన్‌ను ఎదుర్కోగలదని రుజువైంది

AstraZeneca Booster : ప్రపంచాన్ని వణికిస్తోన్న ఒమిక్రాన్ వేరియంట్‌పై ఆస్ట్రాజెనికా (Vaxzevria) వ్యాక్సిన్ ప్రభావంతంగా పనిచేస్తోందని కొత్త అధ్యయనంలో తేలింది. ఆస్ట్రాజెనికా మూడో డోసు (బూస్టర్) ఒమిక్రాన్ వేరియంట్ పై మాత్రమే కాదు.. డెల్టా, బీటా, అల్ఫా, గామా వేరియంట్లను సమర్థవంతంగా ఎదుర్కొగలదని రుజువైంది. బూస్టర్ డోసుతో అధిక స్థాయిలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయని డేటా వెల్లడించింది. ఆస్ట్రాజెనెకా (MRNA) టీకా తీసుకున్నాక బూస్టర్‌ డోసు టీకా ఇవ్వడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని కంపెనీ తెలిపింది. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ అందించే అన్ని దేశాలకు మూడో బూస్టర్‌ ప్రయోగ ఫలితాల డేటాను అంజేస్తామని కంపెనీ వెల్లడించింది. ఇప్పటికే పలు దేశాలు బూస్టర్‌ డోసు పంపిణీని ప్రారంభించాయి. ఈ క్రమంలో ఆస్ట్రాజెనికా ట్రయల్ డేటా ఫలితాలు మరింత ఆశాజనకంగా మారాయి.

ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్‌ను బూస్టర్‌ డోసు ఎంతవరకు ఎదుర్కొంటుంది అనే అంశంపై యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌ పరిశోధకులు అధ్యయనాన్ని నిర్వహించారు. మొదటి రెండు డోసుల తర్వాత బూస్టర్ డోసుగో మూడోది తీసుకోవడం వల్ల ఒమిక్రాన్ వేరియంట్ పై సమర్థవంతంగా ఎదుర్కోగలదని గుర్తించారు. ఈ బూస్టర్‌ ఫలితాలను సంస్థ రిలీజ్ చేసింది. తొలి రెండు డోసుల్లో ఒకే వ్యాక్సిన్‌ లేదా MRNA ఫైజర్‌, మోడెర్నా టీకా తీసుకున్న వారికి ఆస్ట్రాజెనెకా (Vaxzevria) బూస్టర్‌ డోసుతో రోగనిరోధక శక్తి పెరిగినట్టు తాజా అధ్యయనాల్లో తేలిందని ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ గ్రూప్‌ చీఫ్‌ ఆండ్రూ పొలార్డ్‌ వెల్లడించారు.

కరోనా కొత్త వేరియంట్లను ఎదుర్కొనేందుకు బూస్టర్‌ డోసుల వినియోగాన్ని అందుబాటులోకి తీసుకురావాలని పలు దేశాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే బూస్టర్‌ డోసులు ఎంతవరకు ప్రయోజనం కలిగిస్తాయనేదానిపై పరిశోధనలు మొదలయ్యాయి. ఒమిక్రాన్‌ వేరియంట్‌ను ఎదుర్కోవడంలో MRNA ఫైజర్‌, మోడెర్నా, కొవాగ్జిన్‌ సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు కొత్త అధ్యయనంలో తేలింది. ఇప్పుడా జాబితాలో ఆస్ట్రాజెనెకా టీకా కూడా చేరింది. భారత్‌లో కొవిషీల్డ్‌ పేరుతో అత్యధిక స్థాయిలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ అందిస్తున్న సంగతి తెలిసిందే.

Read Also : Sanitary Napkins Free Village:దేశంలో తొలి శానిటరీ న్యాప్కిన్స్ రహిత గ్రామంగా ‘కుంబలంగి’ రికార్డు..పాడ్స్ కు బదులుగా..

ట్రెండింగ్ వార్తలు