Sanitary Napkins Free Village:దేశంలో తొలి శానిటరీ న్యాప్కిన్స్ రహిత గ్రామంగా ‘కుంబలంగి’ రికార్డు..పాడ్స్ కు బదులుగా..

దేశంలో తొలి శానిటరీ న్యాప్కిన్స్ రహిత గ్రామంగా ‘కుంబలంగి’ రికార్డు..

Sanitary Napkins Free Village:దేశంలో తొలి శానిటరీ న్యాప్కిన్స్ రహిత గ్రామంగా ‘కుంబలంగి’ రికార్డు..పాడ్స్ కు బదులుగా..

Sanitary Napkins Free Village

Sanitary Napkins Free Village Kumbalangi : నెలసరి సమయాల్లో యువతులు,మహిళలు శానిటరీ న్యాప్కిన్స్ వాడడం సహజం. బట్టకు బదులుగా ఇవే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతుంటారు. కేరళలోని ఎర్నాకుళంలోని ఓ గ్రామం మాత్రం శానిటరీ న్యాప్కిన్స్ వాడని గ్రామంగా రికార్టు సృష్టించింది. అంటే ఆ గ్రామం తిరోగమనంలో ఉందని కాదు మరింత ముందడుగు వేసే నిర్ణయం తీసుకుంది. దేశంలోనే ‘తొలి శానిటరీ న్యాప్కిన్స్ రహిత గ్రామం’గా కుంబలంగి రికార్డులకెక్కనుంది.

Also read : ప్రభుత్వ విద్యాసంస్థల బాలికలకు ఉచితంగా శానిటరీ నేప్‌కిన్స్‌

పాడ్స్ కు బదులుగా కుంబలంగి ప్యాడ్స్ కు బదులు ‘మెన్ స్ట్రువల్ కప్స్’ను గ్రామంలోని యువతులకు, మహిళలకు అందించనుంది. 18 ఏళ్లు దాటిన మహిళలందరికీ గురువారం (జనవరి 13,2022) 5 వేల మెన్ స్ట్రువల్ కప్పులను పంపిణీ చేయాలనే కార్యక్రమం చేపట్టింది.

‘అవల్కాయ్ (ఆమె కోసం)’ అనే పథకంలో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టామని ఎంపీ హీబి ఈడెన్ తెలిపారు. థింగాల్ స్కీమ్ కింద హెచ్ఎల్ఎల్ మేనేజ్ మెంట్ అకాడమీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నాయని వెల్లడించారు.

Also read : అస్మిత పథకం : యాప్ లో రూ.5కే శానిటరీ ప్యాడ్స్

‘మెన్ స్ట్రువల్ కప్స్’ పంపిణీ కార్యక్రమంలో భాగంగా కుంబలంగిని మోడల్ విలేజ్ గా గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ప్రకటించనున్నారు. ప్రధానమంత్రి సన్సద్ ఆదర్శ్ గ్రామ యోజన (ఎస్ఏజీవై) పథకం కింద ఈ మోడల్ గ్రామ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు.