New Planet
Astronomers Discover New Planet : ఖగోళ శాస్త్రవేత్తలు మరో కొత్త గ్రహాన్ని కనుగొన్నారు. అగ్ని పర్వతాలతో నిండి ఉన్న గ్రహాన్ని తాజాగా గుర్తించారు. ఎరుపు రంగులోని ఓ మరుగుజ్జు నక్షత్రానికి 90 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ గ్రహం భూమి పరిమాణమంత ఉన్నట్లు తేల్చారు.
దీర్ఘవృత్తాకార కక్ష్యలో నక్షత్రం చుట్టూ ఈ గ్రహం తిరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. తన చుట్టూ తాను తిరగకపోవడం వల్ల ఓ వైపు కాంతి, మరోవైపు చీకటితో నిండి ఉన్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అగ్ని పర్వతాలు, నీటికి సంబంధం ఉంటుందని తెలిపారు.
92 moons Jupiter : గురు గ్రహం చుట్టూ 92 చందమామలు
గ్రహంపై అగ్ని పర్వతాలు ఉన్నందు వల్ల ఘన రూపంలో నీరు ఉండే అవకాశం ఉంటుందని వెల్లడించారు. కోట్ల ఏళ్ల క్రితం భూమిపై వాతావరణం, జీవం ఎలా ఏర్పడిందో తెలుసుకునేందుకు ఈ గ్రహం చేసే ప్రయోగాలు ఉపయోగపడతాయని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.