92 moons Jupiter : గురు గ్రహం చుట్టూ 92 చందమామలు

సౌర వ్యవస్థలో అతి పెద్దదైన గురు గ్రహం గురించి ఖగోళ శాస్త్రవేత్తలు ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

92 moons Jupiter : గురు గ్రహం చుట్టూ 92 చందమామలు

moons

92 moons Jupiter : సౌర వ్యవస్థలో అతి పెద్దదైన గురు గ్రహం గురించి ఖగోళ శాస్త్రవేత్తలు ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. చిలి హవాయ్ నుంచి టెలి స్కోప్ లను ఉపయోగించి గురు గ్రహం చుట్టు పక్కల కొత్తగా 12 చంద్రుళ్లను కనుగొన్నారు. ఈ 12 చంద్రుళ్లతో కలిపి గురు గ్రహం చుట్టు పక్కల మొత్తం 92 మూన్స్ ఉన్నట్లు తెలిపారు. మన సౌర కుటుంబంలో పెద్ద గ్రహం గురు గ్రహం. ఇది సూర్యుడి నుంచి ఐదో గ్రహంగా ఉంది.

సౌర వ్యవస్థలో అతి పురాతన గ్రహం కూడా ఇదే. దీనిపై చాలా సుడిగుండాలు, తుపాన్లు ఉన్నాయి. వాటిలో కొన్ని భూమి కంటే పెద్దవి. వందల ఏళ్లుగా ఆ తుపాన్లు అలాగే ఉన్నాయి . గురు గ్రహంపై 10 గంటల్లో ఒక రోజు అయిపోతుంది. గురుగ్రహంపై ఒక సంవత్సరం అయ్యేసరికి భూమిపై దాదాపు 12 ఏళ్లు అయిపోతాయి. గురుగ్రహంలో 1300 భూగోళాలను పట్టించవచ్చు.. అంత పెద్దది. గురుగ్రహానికి 79 చందమామలు ఉన్నాయి.

China Man Made Moon : చైనాలో మరో చందమామ..మొన్న‘కృత్రిమ సూర్యుడు’..ఇప్పుడు నేలపై మరో జాబిల్లి’

వాటిలో కొన్ని బుధగ్రహం కంటే పెద్దవి. గురు గ్రహాన్ని ఫెయిల్ అయిన సూర్యుడు అని పిలుస్తారు. అయితే దానికి ఓ కారణం ఉంది. గురుగ్రహంలో సరిపడా పదార్థం ఉండి ఉంటే అది కూడా సూర్యుడి లాగా మారేది. గురుగ్రహం పూర్తిగా హైడ్రోజన్, హీలియం వాయువులతో మాత్రమే నిండి ఉందని అంచనా. గురుగ్రహం నిజానికి నల్లగా ఉంటుంది. మబ్బుల వల్ల అది రంగుల్లో కనిపిస్తోంది.శనిగ్రహం, యురేనస్ లాగానే గురుగ్రహానికి వలయాలు ఉన్నాయి. అవి కంటితో చూడలేనంత సన్నగా ఉంటాయి.