Congo Boat Accident : ఘోర పడవ ప్రమాదం, 145 మంది జలసమాధి

కాంగోలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. 145 మంది జల సమాధి అయ్యారు. గమ్య స్థానం చేరకముందే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. 200 మందితో వెళ్తున్న పడవ లులోంగా నదిలో మునిగిపోయింది. ఈ ప్రమాదం నుంచి 55 మంది ప్రాణాలతో బయటపడ్డారు.

Congo Boat Accident : కాంగోలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. 145 మంది జల సమాధి అయ్యారు. గమ్య స్థానం చేరకముందే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. 200 మందితో వెళ్తున్న పడవ లులోంగా నదిలో మునిగిపోయింది. ఈ ప్రమాదం నుంచి 55 మంది ప్రాణాలతో బయటపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘోర ప్రమాదం జరిగింది.

లిలాంగా నుంచి 200 మంది ప్రయాణికులతో బయలుదేరిన పడవ.. మంగళవారం లులోంగా నదిలో మునిగిపోయింది. ఈక్వెటియర్‌ ప్రావిన్స్‌లోని బసన్‌కుసు పట్టణం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పడవలో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం వల్లే ఈ ఘోరం జరిగిందని అధికారులు తేల్చారు.

Also Read..Afghanistan: -34 డిగ్రీలకు తగ్గిన ఉష్ణోగ్రత.. 78 మంది మృతి

కాంగోలోని ఈక్వెటియర్‌ ప్రావిన్స్‌లో రవాణా సదుపాయాలు సరిగా లేవు. ఈ కారణంగా ప్రయాణాలకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. గత్యంతరం లేక పడవలను ఆశ్రయించాల్సి వస్తుంది. అయితే, పడవలు నడిపే నిర్వాహకులు.. డబ్బు కోసం కక్కుర్తి పడుతున్నారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. అక్కడ తరచూ ఇలాంటి ప్రమాదాలు జరగడానికి కారణం ఇదే. గత అక్టోబర్‌లో జరిగిన ఓ బోటు ప్రమాదంలో 40 మంది చనిపోయారు.

Also Read..World Oldest Woman Death: ప్రపంచంలో అత్యంత వృద్ధురాలి మృతి.. ఆమె వయస్సు ఎంతంటే?

”పడవలో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఎక్కడం, వారితో పాటు వస్తువులు, పశువులు ఉండటంతో బరువు ఎక్కువై పడవ నదిలో మునిగిపోయింది. వాయవ్య డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో తరచూ పడవ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ రోడ్డు మార్గాలు లేకపోవడంతో ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలు పడవల్లోనే ప్రయాణిస్తున్నారు” అని స్థానికులు వాపోయారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.