World Oldest Woman Death: ప్రపంచంలో అత్యంత వృద్ధురాలి మృతి.. ఆమె వయస్సు ఎంతంటే?

ప్రపంచంలోనే అత్యధిక వయస్సు కలిగిన వృద్ధురాలిగా గిన్నిస్ రికార్డుకెక్కిన ఫ్రెంచ్ మహిళ లుసిల్లే రాండన్ కన్నుమూసింది. ఆమె వయస్సు ప్రస్తుతం 118 సంవత్సరాలు. 1904 ఫిబ్రవరి 11న దక్షిణ ఫ్రాన్స్‌లోని అల్సాస్ నగరంలో ఆమె జన్మించింది.

World Oldest Woman Death: ప్రపంచంలో అత్యంత వృద్ధురాలి మృతి.. ఆమె వయస్సు ఎంతంటే?

World Oldest Woman Death

World Oldest Woman Death: ప్రపంచంలోనే అత్యధిక వయస్సు కలిగిన వృద్ధురాలిగా గిన్నిస్ రికార్డుకెక్కిన ఫ్రెంచ్ మహిళ కన్నుమూసింది. మంగళవారం తెల్లవారు జామున 2గంటలకు ఆమె దక్షిణ ఫ్రాన్స్ టౌలోన్ నగరంలోని తుదిశ్వాస విడిచారు. వృద్ధురాలి పేరు లుసిల్లే రాండర్. క్రైస్తవ సన్యాసిని అయిన ఆమె సిస్టర్ ఆండ్రీగా ప్రసిద్ధి చెందారు. సెయింట్ కేథరిన్ లేబర్ నర్సింగ్ హోం‌లో ఉంటున్నారు. ఆమె మరణవార్తను నర్సింగ్ హోం ప్రతినిధి డేవిడ్ తవెల్లా తెలిపాడు.

World Tallest Woman : ప్రపంచంలోనే పొడవైన మహిళగా గిన్నిస్‌ రికార్డు..ఆమెను చూడాలంటే తల ఎత్తాల్సిందే..

లుసిల్లే రాండన్ 1904 ఫిబ్రవరి 11న దక్షిణ ఫ్రాన్స్‌లోని అల్సాస్ నగరంలో మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ఆమె జన్మించారు. ప్రస్తుతం ఆమె వయస్సు 118 సంవత్సరాలు. ఆమె 119వ ఏట అడుగుపెట్టేందుకు కొద్దిరోజుల ముందే కన్నుమూశారు. జెరోంటాలజీ రీసెర్చ్ గ్రూప్ 110 సంవత్సరాలు కలిగిన, అంతకంటే ఎక్కువారిని గుర్తిస్తుంది. ఈ క్రమంలో జపాన్‌కు చెందిన కెన్ తనకా (119) మరణం తరువాత లుసిల్లే రాండన్ ప్రపంచంలోనే అత్యంత వయస్సు కలిగిన వృద్ధురాలిగా గిన్నీస్ రికార్డుకెక్కింది. ఆమెకు 2021లో 117వ పుట్టినరోజుకు కొద్దిరోజుల ముందు కరోనా సోకింది. అయినా ఆమె కరోనా నుంచి కోలుకొని ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.

World’s Largest Whisky Bottle : ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విస్కీ బాటిల్..ధర Rs.11 కోట్లు..!!

గతంలో ఆమె ఫ్రెంచ్ మీడియాతో మాట్లాడుతూ.. నేను 108ఏళ్ల వయస్సు వరకు పనిచేశానని, ప్రతీరోజూ ఒక గ్లాసు వైన్ తాగడం, చాక్లెట్ తినడం ఇష్టపడతానని తెలిపింది. ప్రస్తుతం లుసిల్లే రాండన్ మరణంతో.. అమెరికాకు చెందిన 115ఏళ్ల మారియా మోరేరా ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వయస్సు కలిగిన వృద్ధురాలిగా రికార్డుల్లో నిలిచారు.