World’s Largest Whisky Bottle : ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విస్కీ బాటిల్..ధర Rs.11 కోట్లు..!!

ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విస్కీ బాటిల్..ధర Rs.11 కోట్లు..!!

World’s Largest  Whisky Bottle : ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విస్కీ బాటిల్..ధర Rs.11 కోట్లు..!!

World's Largest Whisky Bottle Cost $1.4 Million

World’s Largest Whisky Bottle: సాధారణంగా విస్కీ బాటిల్ సైజులు పలు రకాలుగా ఉంటాయి. కానీ ఓ విస్కీ బాటిల్ మాత్రం నిచ్చెన వేసుకుంటేనే గానీ ఆ బాటిల్ మీద అందనంతో పొడవుంది. ఈ అసాధారణ విస్కీ బాటిల్ ప్రపంచంలోనే అతిపెద్ద విస్కీ బాటిల్ గా పేరొందింది. ఈ భారీ పొడవుతున్న విస్కీ బాటిల్ ను వేలానికి పెట్టారు. ఈ వేలం ప్రక్రియ కూడా పూర్తయ్యింది.దాదాపుగా 5 అడుగుల 11 అంగుళాల పొడవు ఉన్న ఈ సీసాలో 311 లీటర్ల విస్కీని నింపి ఉంది. ఈ విస్కీ బాటిల్ ను ఇటీవలే ఆన్ లైన్ లో వేలానికి ఉంచగా.. అందులో భారీ ధరకు అమ్ముడుపోయింది. అయితే ఈ అతిపెద్ద విస్కీ బాటిల్ ధర సుమారు 1.4 మిలియన్లు డాలర్లు అంటే సుమారుగా రూ. 10,85,30,100.00 ఉంటుంది. అంటే దాదాపు రూ.11 కోట్లకు వేలానికి ఉంచారు.

Also read : World’s longest hair :పొడవాటి జుట్టుతో గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసిన యువతి..12 ఏళ్లకు హెయిర్ కట్టింగ్..

ఇంత భారీ బాటిల్ లో విస్కీ ఎంత ఉంటుంది? అనే డౌటు కూడా వచ్చి తీరుతుంది. ఈ 5 అడుగుల 11 అంగుళాల పొడవున్న బాటిల్ లో 311 లీటర్ల స్కాచ్ విస్కీ పడుతుంది. ఈ బాటిల్ ప్రపంచంలోనే అతిపెద్దదిగా నిలిచింది.విస్కీకి ఇంట్రెపిడ్ బ్రాండ్ పేరు పెట్టినట్లు వేలం కంపెనీ తెలిపింది. ఇది ఒకే మాల్ట్.. దాదాపు 32 సంవత్సరాల కాలం నాటి విస్కీ బాటిల్.

Also read : Guinness Record : 84 ఏళ్లుగా ఒకే కంపెనీలో పనిచేసినందుకు గిన్నిస్‌ రికార్డు

దీన్ని 1989లో స్పైసైడ్ ప్రతిష్టాత్మకమైన ది మకాలన్ నెలకొల్పగా.. సెప్టెంబర్ 2021లో విస్కీని నింపి గిన్నిస్ ప్రపంచ రికార్డును నమోదు చేసింది. ఈ బాటిల్‌లో దాదాపు 444 విస్కీ బాటిళ్లతో సమానమైన ఆల్కహాల్ ఉన్నట్లు సమాచారం. హా అన్నట్లుగా ప్రపంచంలోనే అత్యంత పెద్ద విస్కీ బాటిల్ గా నిలిచి ఈ భారీ విస్కీ బాటిల్ గిన్నిస్ రికార్డు కూడా సాధించింది.

Also read : Guinness World Record: 75ఏళ్ల వ్యక్తి చేసిన ఈ ఫీట్‌తో గిన్నీస్ వరల్డ్ రికార్డ్