Woman Guinness Record : తాడు మీద హై హీల్స్ తో జంప్ చేసి..మహిళ గిన్నిస్ రికార్డు

తాడు మీద హై హీల్స్ తో జంప్ చేసి..మహిళ గిన్నిస్ రికార్డు సృష్టించింది. హైహీల్ వేసుకుని నడవటమే కష్టం..అటువంటిది ఏకంగా తాడుమీద జంప్ చేయటం నిజంగా అమేజింగ్ అంటున్నారు నెటిజన్లు.

Woman Guinness Record : తాడు మీద హై హీల్స్ తో జంప్ చేసి..మహిళ గిన్నిస్ రికార్డు

Woman Guinness Record

Updated On : February 23, 2022 / 11:54 AM IST

woman Guinness record jumping on rope with high heels హై హీల్స్ వేసుకొని న‌డ‌వటమే కష్టం. హై హీల్స్ ఫ్యాషన్ కోసం..కాస్త రిచ్ కోసం వేసుకుంటుంటారు హై మహిళలు. వేసుకున్నా ఇబ్బంది మాత్రం తప్పదు. హైహీల్స్ వేసుకుంటే కాళ్ల నొప్పులతో పాటు నడుము నొప్పి రావటం ఖాయం. అటువంటి హైహీల్స్ వేసుకుని నడవటమే కష్టం అనుకుంటే ఓ మహిళ ఏకంగా వాటితో జంప్ చేసింది. అదీకూడా గాల్లో కట్టిన తో తాడుపై జంప్ చేసింది. అందుకే ఆ జంప్ తో ఆమె గిన్నిస్ రికార్డు కూడా సాధించింది.

Also read : World Biggest Strawberry : పావుకిలోకంటే పెద్ద స్ట్రాబెర్రీ గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డు..

యూఎస్‌లోని కాలిఫోర్నియాకు చెందిన‌ ఓగ్లీ హెన్రీ అనే అథ్లెట్ ఈ అరుదైన వినూత్న రికార్డును క్రియేట్ చేసి ఔరా..ఏమి ఈ ‘హై జంప్’అనేలా చేసింది. సాంటా మోనికా బీచ్‌లో త‌ను ఈ స్టంట్‌ను చేసి అందరినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది ఓగ్లీ హెన్రీ. ఆమె గిన్నిస్ రికార్డుకు వీడియోను గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు.

Alsor read : World’s longest hair :పొడవాటి జుట్టుతో గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసిన యువతి..12 ఏళ్లకు హెయిర్ కట్టింగ్..

దీంతో ఆ హైహీల్ జంప్ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. కానీ ఇటువంటివాటిని చూసి అనుకరించకపోవటం మంచిది. లేదంటే కాళ్లతో పాటు నడుము కూడా విరిగే ప్రమాదముంది. సో..ఎవ్వరు అనుకరించకుండా ఉంటేమంచిది..

Alsor read : World Tallest Woman : ప్రపంచంలోనే పొడవైన మహిళగా గిన్నిస్‌ రికార్డు..ఆమెను చూడాలంటే తల ఎత్తాల్సిందే..