Helicopters Collide: గగనతలంలో రెండు హెలికాప్టర్ల ఢీ… నలుగురి మృతి

గగనతలంలో 13 మందితో వెళ్తున్న రెండు హెలికాప్టర్లు ఢీ కొని నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ఆస్ట్రేలియాలో పర్యాటకుల తాకిడి అధికంగా ఉండే దక్షిణ బ్రిస్బేన్ లోని గోల్డ్ కోస్ట్ బీచ్ లో ఇవాళ ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Helicopters Collide: గగనతలంలో 13 మందితో వెళ్తున్న రెండు హెలికాప్టర్లు ఢీ కొని నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ఆస్ట్రేలియాలో పర్యాటకుల తాకిడి అధికంగా ఉండే దక్షిణ బ్రిస్బేన్ లోని గోల్డ్ కోస్ట్ బీచ్ లో ఇవాళ ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఆ రెండు హెలికాప్టర్లు ఢీ కొన్న అనంతరం సీ వరల్డ్ రిసార్టుకు సమీపంలో ఇసుకదిబ్బపై పడ్డాయని అధికారులు వివరించారు. ఆ ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యలు కొనసాగించడానికి అత్యవసర సేవల సిబ్బంది బాగా శ్రమించాల్సి వచ్చిందని అన్నారు. ప్రమాద సమయంలో ఆ రెండు హెలికాప్టర్లలో ఉన్న 13 మంది వివరాలను సేకరించామని చెప్పారు. గాయాలపాలైన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

ఇసుక దిబ్బలపై హెలికాప్టర్ల శకలాలు కనపడ్డాయి. గాయాలపాలైన వారిని రక్షించడానికి ఓడల్లో సహాయక బృందాలు అక్కడకు వెళ్లాయి. ఈ హెలికాప్టర్ల ప్రమాదానికి కారణాన్ని నిర్ధారించడానికి విచారణ జరుపుతున్నామని చెప్పారు. ఓ హెలికాప్టర్ గగనతలం నుంచి కిందకి వస్తున్న సమయంలో, మరో హెలికాప్టర్ టేకాఫ్ అయిందని, అనంతరం కొద్ది సేపటికే ఈ రెండు ఢీ కొన్నాయని ప్రాథమిక విచారణలో తెలిసిందని అన్నారు.

IMF BIG STATEMENT: 2023లో గడ్డు పరిస్థితులు.. ప్రపంచంలో ఈ దేశాల్లో తీవ్ర ఆర్థిక మాంద్యం

ట్రెండింగ్ వార్తలు