IMF BIG STATEMENT: 2023లో గడ్డు పరిస్థితులు.. ప్రపంచంలో ఈ దేశాల్లో తీవ్ర ఆర్థిక మాంద్యం

నూతన ఏడాది ప్రపంచ దేశాలను కలవరపెట్టే ప్రకటన చేసింది అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ. 2023లో ప్రపంచంలోని మూడింట ఒకవంతు దేశాలు ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటాయని చెప్పింది. ముఖ్యంగా అమెరికా, ఈయూ, చైనాల్లో ఆర్థిక మాంద్య పరిస్థితులు వస్తాయని చెప్పింది.

IMF BIG STATEMENT: 2023లో గడ్డు పరిస్థితులు.. ప్రపంచంలో ఈ దేశాల్లో తీవ్ర ఆర్థిక మాంద్యం

IMF..World Bank Warn of Increasing Risk of Global Recession

IMF BIG STATEMENT: నూతన ఏడాది ప్రపంచ దేశాలను కలవరపెట్టే ప్రకటన చేసింది అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ. 2023లో ప్రపంచంలోని మూడింట ఒకవంతు దేశాలు ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటాయని చెప్పింది. ముఖ్యంగా అమెరికా, ఈయూ, చైనాల్లో ఆర్థిక మాంద్య పరిస్థితులు వస్తాయని చెప్పింది.

ఐఎంఎఫ్ ఎండీ క్రిష్టాలినా జార్జీవా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రపంచంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులపై వివరాలు తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2022లో ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితుల కన్నా 2023లో అధికంగా కుదేలు కానుందని చెప్పారు.

‘‘ఐరోపా సమాఖ్యలోని సగం దేశాలు ఆర్థిక మాంద్యంలో కూరుకుపోనున్నాయి. ప్రపంచంలోని మూడింట ఒకవంతు దేశాలు ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటాయి. మరికొన్ని నెలల్లో చైనాలో తీవ్ర ప్రతికూల ఆర్థిక పరిస్థితులు నెలకొంటాయి. చైనా వృద్ధి రేటు పడిపోతుంది.

ప్రపంచ వృద్ధి రేటు కూడా తగ్గుతుంది. చైనాలో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయి. నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా చైనా వార్షిక వృద్ధిరేటు పడిపోతుంది. ప్రపంచ వృద్ధి రేటుకు సమానంగా లేదా అంతకంటే తక్కువగా ఉంటుంది’’ అని క్రిష్టాలినా జార్జీవా చెప్పారు.

అమెరికాలో లేబర్ మార్కెట్ బలవంతంగా ఉండడంతో తీవ్ర ఆర్థిక మాంద్యం నుంచి ఆ దేశం తప్పించుకునే అవకాశం ఉందని అన్నారు. అమెరికాలో నిరుద్యోగ పరిస్థితులు ప్రమాదకరంగా ఏమీ లేవని చెప్పారు.

Bairi Naresh: కావాలనే అలాంటి వ్యాఖ్యలు చేశా.. బైరి నరేష్ అంగీకారం.. రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడి