Bairi Naresh: కావాలనే అలాంటి వ్యాఖ్యలు చేశా.. బైరి నరేష్ అంగీకారం.. రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడి
పోలీసులు జరిపిన విచారణలో నరేష్ తన నేరాన్ని అంగీకరించినట్లు అతడి రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడైంది. గత డిసెంబర్ 19న కొడంగల్‌లో జరిగిన అంబేదర్క్ విగ్రహావిష్కరణ సభలో బైరి నరేష్ ప్రసంగించాడు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

Bairi Naresh: అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ తాను ఉద్దేశపూర్వకంగానే ఆ వ్యాఖ్యలు చేసినట్లు అంగీకరించాడు. ఈ అంశంపై పోలీసులు జరిపిన విచారణలో నరేష్ తన నేరాన్ని అంగీకరించినట్లు అతడి రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడైంది. గత డిసెంబర్ 19న కొడంగల్‌లో జరిగిన అంబేదర్క్ విగ్రహావిష్కరణ సభలో బైరి నరేష్ ప్రసంగించాడు.
Hyderabad: హైదరాబాద్‌లో అర్ధరాత్రి దాకా మెట్రో రైల్ సర్వీసులు.. రెండు కారిడార్లలో ప్రారంభం
ఈ సందర్భంగా అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వ్యాఖ్యలపై వివాదం రేగింది. నరేష్ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, అయ్యప్ప స్వామి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఉమాపతి గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసిన పోలీసులు నరేష్‌ను అరెస్ట్ చేశారు. పోలీసుల రిమాండ్‌లో ఉన్న నరేష్ విచారణలో కీలక విషయాలు వెల్లడించాడు. తాను కావాలనే ఆ వ్యాఖ్యలు చేసినట్లు అంగీకరించాడు. ఈ విషయాన్ని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే, విద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.
ఈ ఘటనకు సంబంధించి నలుగురు ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డు చేశారు. కాగా, ఈ అంశంపైనే కాకుండా గతంలో కూడా నరేష్‌పై పలు కేసులు నమోదయ్యాయి. హన్మకొండతోపాటు, నవాబ్ పేట పోలీస్ స్టేషన్లలోనూ అతడిపై కేసులు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు.