Australia demands answers: ఖాతర్ రాజధాని దోహాలో విమానాశ్రయంలో అప్పుడే పుట్టిన శిశువును కనుగొన్నారు. ఎవరో అప్పుడే ప్రసవించి అక్కడే వదిలేశారని ఖతార్ ఎయిర్ పోర్ట్ అధికారులు అనుమానించారు. అందుకే ఖతార్ నుంచి ఆస్ట్రేలియాకు వెళుతున్న QR908 విమానాన్ని ఆపి. ఆస్ట్రేయాలియా మహిళలను దింపి, వైద్యులు చేత దుస్తులు విప్పి పరీక్షించింది. మహిళలను గంటల తరబడి పరిశీలించింది.
మా మహిళలను అవమానిస్తారా అంటూ ఖతార్ విమానాశ్రయ అధికారుల చర్యపై ఆస్ట్రేలియా తీవ్రంగా స్పందించింది. ఫ్లైట్ QR908 శుక్రవారం ఉదయం 8.30 గంటలకు ఖతార్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సిడ్నీకి బయలుదేరాల్సి ఉంది. అప్పుడు అధికారులు విమానాశ్రయం మరుగుదొడ్డిలో నవజాత శిశువును కనుగొన్నారు. దీని తరువాత, విమానంలో ఉన్న చాలా మంది మహిళలను కిందకు దించి, వారికి గర్భానికి సంబంధించిన వైద్య పరీక్షలు చేశారు.
https://10tv.in/britain-wife-slaps-anti-masker-husband-on-easy-jet-flight-in-manchester/
విమానంలో మొత్తం 34మంది ప్రయాణికులు ఉండగా.. వారిలో 13మంది మహిళలను ఖాతర్‌లోని విమానాశ్రయంలో వైద్యులచే బట్టలు విప్పించి పరీక్షలు నిర్వహించారు. విమానంలోని ఓ ప్రయాణికుని సమాచారం ప్రకారం.. మహిళలు పరీక్షలు తర్వాత చాలా కలత చెంది కనిపించారని, ఆ విమానంలోకి వచ్చిన తర్వాత ఒక మహిళ ఏడుపు ప్రారంభించిందని ప్రయాణికుడు వెల్లడించారు. వివస్త్రలను చేసి పరిశీలించారని అది అనాగరిక పని అని ఆస్ట్రేలియన్లు అభిప్రాయపడుతున్నారు.
‘గార్డియన్’ ప్రకారం, 34 మందిలో 13 మంది మహిళలపై మూడు గంటలకు పైగా ధర్యాప్తు కొనసాగింది. ఆ తరువాత మాత్రమే విమానం కదిలింది. సుమారు 13 మంది మహిళలను విచారణ కోసం అదుపులోకి తీసుకోగా.. లేడీ డాక్టర్ తన బట్టలన్నీ తీసివేసి, మహిళలు ఇటీవల ఏ బిడ్డకైనా జన్మనిచ్చారా? అని తెలుసుకోవడానికి ప్రయత్నించారని చెబుతున్నారు.
ఆస్ట్రేలియా ఈ ప్రవర్తనపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళల ఖాతర్ చర్య పూర్తిగా తప్పు అని ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో నిందించింది. ఖతార్ విమానాశ్రయ అథారిటీకి అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖ రాసింది. మరోవైపు, ఖతార్ ఎయిర్‌వేస్ ఈ విషయంలో ఏ ప్రయాణీకుడూ ఎటువంటి ఫిర్యాదు చేయలేదని, ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.