Salman Rushdie Attacked : ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై దాడి.. న్యూయార్క్‌లో ఘటన

ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై న్యూయార్క్ లో దాడి జరిగింది. చౌటాక్వా విద్యాసంస్థలో ఆయన ప్రసంగించబోతుండగా, ఒక్కసారిగా వేదికపైకి దూసుకొచ్చిన ఆగంతుకుడు ఆయనపై దాడి చేశాడు. దాంతో సల్మాన్ రష్దీ కిందపడిపోయారు. వేదికపై ఉన్న వారు ఆ వ్యక్తిని పట్టుకున్నారు. రష్దీని ఓ హెలికాప్టర్ లో ఆసుపత్రికి తరలించారు.

Salman Rushdie Attacked : ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై(75) న్యూయార్క్ లో దాడి జరిగింది. చౌటాక్వా విద్యాసంస్థలో ఆయన ప్రసంగించబోతుండగా, ఒక్కసారిగా వేదికపైకి దూసుకొచ్చిన ఆగంతుకుడు ఆయనపై దాడి చేశాడు. దాంతో సల్మాన్ రష్దీ కిందపడిపోయారు. వేదికపై ఉన్న వారు ఆ వ్యక్తిని పట్టుకున్నారు. రష్దీని వెంటనే ఓ హెలికాప్టర్ లో ఆసుపత్రికి తరలించారు.

1988లో సల్మాన్ రష్దీ రచించిన ‘ద శాటానిక్ వర్సెస్’ అనే పుస్తకం వివాదాస్పదమైంది. ఇస్లామిక్ ఛాందసవాదులను ఈ పుస్తకం తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. రష్దీ దైవదూషణకు పాల్పడ్డాడంటూ అతడిపై నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలో, రష్దీపై ఇరాన్ నేత అయతుల్లా ఖొమేనీ ఫత్వా కూడా విధించారు. రష్దీని చంపిన వారికి 3 మిలియన్ డాలర్ల నజరానా ప్రకటించింది ఇరాన్. సల్మాన్ రష్దీ ముస్లిం ఛాందసవాదుల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్న క్రమంలో ఆయనపై దాడి సంచలనం రేపింది.

అమెరికాలో ఉంటున్న పాకిస్తాన్ కు చెందిన వ్యక్తి సల్మాన్ రష్దీపై దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాడికి పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సల్మాన్ రష్దీపై దాడి ఘటన సంచలనం రేపింది. ఈ దాడి అక్కడున్న వారిని షాక్ కి గురి చేసింది. అసలేం జరుగుతుందో అర్థమయ్యే లోపే దుండగుడు దాడికి పాల్పడ్డాడు.

 

1947లో ముంబైలో జన్మించిన సల్మాన్‌ రష్దీ.. కొన్నాళ్ల తర్వాత బ్రిటన్‌కు తరలివెళ్లారు. 1981లో ఆయన తన రెండో నవల మిడ్ నైట్స్ చిల్డ్రన్ రచించారు. ఆ నవలకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందాయి. ఆ నవలకు బ్రిటన్ ప్రతిష్టాత్మక బుకర్‌ ప్రైజ్‌ దక్కడంతో ఆయన ఒక్కసారిగా ఫేమస్‌ అయ్యారు. కాగా, ఆయన రచించిన పలు నవలలు వివాదాస్పదయ్యాయి. ముఖ్యంగా 1988లో రచించిన ‘ది సాతానిక్‌ వెర్సెస్‌‌’ (The Satanic Verses) నవల వివాదాలకు కేంద్రబిందువై.. ఆయనకు హత్యా బెదిరింపులు కూడా వచ్చాయి. మతాన్ని కించపరుస్తోందని ఆరోపిస్తూ ఇరాన్‌లో ఈ నవలను నిషేధించారు. కాగా బెదిరింపుల నేపథ్యంలో దాదాపు పదేళ్ల పాటు ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. ఎవరూ గుర్తు పట్టకుండా తరుచుగా ఇళ్లు మారారు. తాను ఎక్కడ నివాసం ఉంటున్నది తన పిల్లలకు కూడా చెప్పేవాడు కాదు సల్మాన్ రష్దీ.

సల్మాన్ రష్దీ భారత సంతతికి చెందిన ప్రముఖ బ్రిటీష్ నవలా రచయిత, బుకర్ ప్రైజ్ విజేత. అమెరికా న్యూయార్క్‌లోని చౌతాక్వా ప్రాంతంలోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో సమావేశానికి సల్మాన్‌ రష్దీ హాజరయ్యారు. ఆయన ప్రసంగానికి సిద్ధమవుతున్న క్రమంలోనే స్టేజిపైకి దూసుకొచ్చిన ఓ దుండగుడు కత్తితో మెడపై దాడికి పాల్పడినట్లు స్థానిక న్యూస్‌ ఏజెన్సీలు వెల్లడించాయి. కత్తి పోట్లకు గురైన రష్దీ అక్కడిక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను హెలికాప్టర్‌లో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే అంశం మాత్రం తెలియలేదని న్యూయార్క్‌ పోలీసులు వెల్లడించారు. దాడి చేసిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

సల్మాన్ రష్దీపై దాడి..

ట్రెండింగ్ వార్తలు