avoid touching MEN, instead follow WOMEN.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన కొవిడ్ రూల్స్, అర్థం ఏంటో తెలిస్తే సూపర్బ్ అనాల్సిందే

  • Publish Date - September 9, 2020 / 11:28 AM IST

కరోనావైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనాను ఖతం చేసే వ్యాక్సిన్ కానీ, నయం చేసే మందు కానీ ఇంకా అందుబాటులోకి రాలేదు. దీంతో సమర్థవంతమైన, సురక్షితమైన వ్యాక్సిన్ లేదా మందు వచ్చే వరకు ముందు జాగ్రత్తలు పాటించాలని, కరోనా బారి నుంచి కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముందు జాగ్రత్తలు అంటే ఇంటి నుంచి బయటకు వెళితే తప్పససరిగా మాస్కు ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. ఇవీ ముందుజాగ్రత్తలు. దాదాపుగా చాలామంది జనాలు ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారు.

కోవిడ్ రూల్స్ పాటించని జనాలు:
కాగా, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ లాక్ దశలు నడుస్తున్నాయి. ప్రభుత్వాలు భారీగా ఆంక్షల్లో సడలింపులు ఇస్తున్నాయి. దీంతో ఇన్నాళ్లూ ఇళ్లకే పరిమితమైన జనాలు మళ్లీ రోడ్లమీదకు వస్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్ పోర్టులు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. అయితే కొందరు ప్రజలు ఇంకా కరోనావైరస్ పూర్తిగా పోలేదనే విషయాన్ని మర్చిపోతున్నారు. దీంతో కోవిడ్ రూల్స్ ని బ్రేక్ చేస్తున్నారు. మాస్కులు లేకుండా రోడ్లపైకి వస్తున్నారు. గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు.


https://10tv.in/sons-leave-mother-in-farm-due-to-coronaviurs/
కరోనా జాగ్రత్తలపై సెమినార్లు:
ఈ క్రమంలో పలు ఆఫీసులు, సంస్థలు సెమినార్లు నిర్వహిస్తున్నాయి. కరోనావైరస్ మహమ్మారి ఇంకా పోలేదు, మీ జాగ్రత్తలో మీరు ఉండండి, కరోనా వ్యాప్తిని అరికట్టండి అని గుర్తు చేస్తున్నారు. ఎంతో ఫన్నీగా ఈ విషయాన్ని వివరిస్తున్నారు. కరోనా రూల్స్ గురించి చెబుతూ ట్విట్టర్ లో చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ ట్వీట్ కడుపుబ్బా నవ్విస్తోంది. అందులో ఉన్న అర్థం, పరమార్థం తెలిశాక, వారి క్రియేటివిటీకి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేరు.

Men, Women అంటే అర్థం ఇదే:
ఇంతకీ ఆ ట్వీట్ లో ఏముందంటే.. మెన్ ను(MEN) ను తాకడం నివారించండి. Women ను ఫాలో కండి.. మిడిల్ ఈస్ట్ కు చెందిన ఓ విద్యార్థి ఈ ఇమేజ్ లను షేర్ చేశాడు. విద్యార్థులు ఇంటి నుంచి బయటకు వచ్చాక కచ్చితంగా ఈ కొవిడ్ రూల్స్ పాటించాలి అని చెప్పాడు. కొవిడ్ రూల్స్ ను మెన్షన్ చేస్తూ ఆ విద్యార్థి వాడిన మెన్, ఉమెన్ పదాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

విద్యార్థి క్రియేటివిటీ అదుర్స్:
మ్యాటర్ ఏంటంటే, Men అంటే పురుషులు కాదు.. Men అంటే.. M-Mouth, E-Eyes, N-Nose.. Avoid Touching Men అంటే.. మీ నోటిని, కళ్లను, ముక్కుని తాకొద్దు అని అర్థం. ఇక ఫాలో Women అంటే… W-Wash Your Hands, O-Obey Social Distancing, M-Mask Up, E-Exercise and Eat Well, N-No Unnecessary Crowding.

మెన్, ఉమెన్ పదాలతో కొవిడ్ రూల్స్ చెప్పిన విద్యార్థిపై ప్రశంసల వర్షం:
ఇప్పుడు అర్థమైంది కదూ.. మెన్, ఉమెన్ పదాల వెనుక ఉన్న పరమార్థం. ఇప్పుడీ ఇమేజ్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ విద్యార్థి క్రియేటివిటీకి అంతా హ్యాట్సాఫ్ చెబుతున్నారు. చాలా హిలేరియస్ గా ఉందని కితాబిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ గైడ్ లైన్స్ చాలా ముఖ్యం అని అంటున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా రెప్పపాటులో కరోనావైరస్ కాటేస్తుంది జాగ్రత్త అంటున్నారు. ముందు జాగ్రత్తలే మనకు శ్రీరామరక్ష అని స్పష్టం చేస్తున్నారు. కోవిడ్ రూల్స్ పాటిద్దాం, కరోనాను తరిమికొడదాం అని పిలుపునిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు