కరోనాను మించిన వ్యాధి: చనిపోయే 2గంటల ముందు చిన్నారి ఫోటో

  • Publish Date - May 17, 2020 / 03:33 AM IST

అమెరికా, బ్రిటన్ దేశాల్లో వందలాది మంది చిన్నారులు కరోనావైరస్‌ లక్షణాలు పోలిన ఒక అరుదైన వ్యాధి బారిన పడుతూ ఉన్నారు. కరోనా వైరస్ రూపాంతరం చెంది, చిన్నారుల్లో భయంకరమైన ప్రభావం చూపిస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఇప్పటికే బ్రిటన్‌లో 100 మందికి పైగా పిల్లలు ఈ వ్యాధి బారినపడ్డారు. కొంత మందిని ఇంటెన్సివ్ కేర్‌లో పెట్టాల్సిన అవసరం కూడా ఏర్పడింది. యూరప్‌లోని కొన్ని దేశాల్లో కూడా పిల్లల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. 

లండన్‌లో ఈ వ్యాధి గురించి నేషనల్ హెల్త్ సర్వీస్ డాక్టర్లని అప్రమత్తం చేసిన కొద్ది రోజులోనే 8 కేసులు వెలుగు చూడగా.. అందులో 14ఏళ్ల బాలుడు చనిపోయాడు. ఈ వ్యాధికి గురైన పిల్లలందరిలో అధిక శరీర ఉష్ణోగ్రత (జ్వరం), ఎర్రబడిన కళ్ళు, దద్దుర్లు, వాపు, నొప్పులు, గొంతు వాపు, పెదవులు పొడిబారడం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.

ఈ వ్యాధికి గురైన పిల్లల్లో శ్వాసకోశ ఇబ్బందులు కనిపించనప్పటికీ ఏడుగురిని వెంటిలేటర్ మీద పెట్టవలసి వచ్చింది. ఇది కవాసకి డిసీజ్ షాక్ సిండ్రోమ్ అనే ఒక అరుదైన వ్యాధి లాంటిదని డాక్టర్లు చెబుతున్నారు.

కరోనావైరస్ లాంటి మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రబలిన సమయంలో ఈ వ్యాధి బయటపడటంతో దీనికి, కోవిడ్-19కి సంబంధం ఉండి ఉండొచ్చని లండన్ ఇంపీరియల్ కాలేజీలో పీడియాట్రిక్ ఇన్‌పెక్షియస్ డిసీజెస్ అనుమానం వ్యక్తం చేస్తుంది.

లేటెస్ట్‌గా ఈ వ్యాధికి గురై చనిపోయిన చిన్నారి ఫోటో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కన్నీరు పెట్టిస్తుంది. ఈ ఫోటో తీసుకున్న రెండు గంటల తర్వాత బేబీ కరోనావైరస్ సంబంధిత కవాసకి వ్యాధితో చనిపోయింది. ఎనిమిది నెలల అలెగ్జాండర్ పార్సన్స్ కవాసాకి వ్యాధికి గురై చనిపోయిన అతి చిన్న వయస్కుడు.