Baby Shark: యూట్యూబ్ లో 10 బిలియన్ వ్యూస్ తో “బేబీ షార్క్” సెన్సేషన్

దక్షిణ కొరియాకు చెందిన "పింక్‌ఫాంగ్" అనే సంస్థ రూపొందించిన "Baby Shark" అనే వీడియో యూట్యూబ్ లో వెయ్యి కోట్ల వ్యూస్ దాటిన మొట్టమొదటి వీడియోగా రికార్డు సృష్టించింది

Baby Shark: యూట్యూబ్ లో ఎన్ని వ్యూస్ వస్తే వీడియో అంత హిట్. వీడియో ఎంత ఆకట్టుకుంటే అన్ని వ్యూస్. కానీ ఆకట్టుకునే వీడియోలు తీయడం అందరికి సాధ్యమయే పనికాదు. తీసిన వీడియోకి 10 లక్షల వ్యూస్ రావడమే ఎంతో పెద్ద విశేషం. అలాంటిది ఒక యూట్యూబ్ వీడియో ఏకంగా వెయ్యి కోట్ల వ్యూస్ రాబట్టింది. సంఖ్యా పరంగా ఇది ప్రపంచ జనాభా కంటే దాదాపు 25 శాతం ఎక్కువ కావడం విశేషం. దక్షిణ కొరియాకు చెందిన “పింక్‌ఫాంగ్” అనే సంస్థ రూపొందించిన “Baby Shark” అనే వీడియో ఈ ఘనత సాధించింది. యూట్యూబ్ లో వెయ్యి కోట్ల వ్యూస్ దాటిన మొట్టమొదటి వీడియోగా రికార్డు సృష్టించింది.

Also read: Kadapa Politics: ప్రొద్దుటూరు వైసీపీలో తారాస్థాయికి చేరిన వర్గపోరు

దక్షిణ కొరియాకు చెందిన పింక్‌ఫాంగ్ అనే సంస్థ స్థానిక కొరియా పద్యాలను(Rhymes) చిన్నారుల కోసం వీడియోలుగా రూపొందిస్తుంటుంది. అలా 2016లో “Baby Shark” అనే వీడియో రూపొందించింది. ఒక్కసారి వింటే మళ్లీ మళ్లీ వినాలనిపించే లిరిక్స్ (ప్రాసతో కూడిన), ఆకట్టుకునే గాత్రం.. అన్నిటికి మించి యానిమేటెడ్ చేపలు, చిన్నారులతో రూపొందించిన ఆ వీడియో ప్రపంచ వ్యాప్తంగా చిన్నారులను తెగ ఆకట్టుకుంది. ఆరు నెలల వయసున్న చిన్నారుల నుంచి బడికి వెళ్లే విద్యార్థులందరూ “Baby Shark” పాటకు బాగా కనెక్ట్ అయిపోయారు. దీంతో యూట్యూబ్ లో అత్యంత వ్యూస్(10,007,936,555) రాబట్టిన వీడియోగా చరిత్ర సృష్టించింది.

Also read: Baby Rescued: మైనస్ డిగ్రీల చలిలో చావు బ్రతుకుల మధ్య పసికందు లభ్యం

ఆద్యంతం ఒక ప్రాసలో సాగే ఈపాటను కొరియన్-అమెరికన్ గాయని హోప్ సెగోయిన్ అనే బాలిక తన 10 సంవత్సరాల వయస్సులో పాడింది. యూట్యూబ్ లో “baby shark” వీడియో వెయ్యి కోట్ల వ్యూస్ దాటడంపై.. ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (UNFPA) స్పందిస్తూ.. ప్రపంచ జనాభాలోని ప్రతి ఒక్కరు కనీసం ఒక్కసారైనా ఈ పాటను చూసి ఉంటారని.. పేర్కొంది. కాగా 2020లో నవంబర్ లో ఇదే వీడియో 7 బిలియన్ వ్యూస్ దాటి గిన్నిస్ బుక్ లో స్తానం సంపాదించింది. ఇక “Baby Shark” తరువాత 7,701,885,785 వీక్షణలతో “Despacito” అనే పాప్ సాంగ్ రెండో స్థానంలో ఉంది.

Also read: Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు మృతి

ట్రెండింగ్ వార్తలు