Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు మృతి

ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ప్రధానోపాధ్యాయుడు మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది.

Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు మృతి

Accident

Road Accident: ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ప్రధానోపాధ్యాయుడు మృతి చెందిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన రాములు నాయక్(32), గంభీరావుపేట మండలం రాజుపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాడు. శుక్రవారం పండగ సందర్భంగా తన మామను తీసుకొచ్చేందుకు రాములు నాయక్.. స్కూటీపై మాచారెడ్డి నుంచి గంభీరావుపేటకు బయలుదేరాడు.

Also Read: Parrots Smuggling: రూ.1000 కోసం 140 రామచిలుకల అక్రమ రవాణా చేస్తున్న యువకుడు

ఈక్రమంలో గంభీరావుపేట సమీపంలోని పెద్దమ్మ సరిహద్దుల్లో.. రాములు నాయక్ స్కూటీని.. సిద్ధిపేట డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో రాములు నాయక్ అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రమాదం పై సమాచారం అందుకున్న గంభీరావుపేట పోలీసులు.. ప్రమాద స్థలిని పరిశీలించి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ పెద్దను కోల్పోవడంపై రాములు నాయక్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Also read: Republic Day: మరోసారి కేరళ శకటాన్ని తిరస్కరించిన రక్షణశాఖ