Parrots Smuggling: రూ.1000 కోసం 140 రామచిలుకల అక్రమ రవాణా చేస్తున్న యువకుడు

వెయ్యి రూపాయల కోసం ఓ యువకుడు రామచిలుకలను అక్రమరవాణా చేస్తూ బోర్డర్ సెక్యూరిటీకి పట్టబడ్డాడు. ఈఘటన బంగ్లాదేశ్ - భారత్ సరిహద్దులో గురువారం చోటుచేసుకుంది

Parrots Smuggling: రూ.1000 కోసం 140 రామచిలుకల అక్రమ రవాణా చేస్తున్న యువకుడు

Bsf

Parrots Smuggling: వెయ్యి రూపాయల కోసం ఓ యువకుడు రామచిలుకలను అక్రమరవాణా చేస్తూ బోర్డర్ సెక్యూరిటీకి పట్టబడ్డాడు. ఈఘటన బంగ్లాదేశ్ – భారత్ సరిహద్దులో గురువారం చోటుచేసుకుంది. భారత్ నుంచి బాంగ్లాదేశ్ మధ్య నిత్యం వందలాది మంది ప్రజలు ప్రయాణాలు సాగిస్తుంటారు. ఈక్రమంలో పశ్చిమబెంగాల్.. నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని తరాలి బోర్డర్ అవుట్ పోస్ట్ మీదుగా కొందరు యువకులు అనుమానాస్పదంగా కదలడం బోర్డర్ సిబ్బంది గమమనించారు. భుజాన పెద్ద సంచిని మోసుకుంటూ వెళ్తున్న కొందరు యువకులను సెక్యూరిటీ సిబ్బంది నిలువరించేందుకు ప్రయత్నించగా.. వారు అక్కడి నుంచి పరుగు తీశారు. ఈక్రమంలో ఒక యువకుడిని సెక్యూరిటీ సిబ్బంది పట్టుకుని తనిఖీ చేయగా.. అతని వద్దనున్న సంచిలో 140 రామచిలుకలు ఉన్నాయి. యువకులు రామచిలుకలను అక్రమంగా బాంగ్లాదేశ్ కు తరలించేందుకు ప్రయత్నించినట్లు BSF అధికారులు పేర్కొన్నారు.

Also Read: Republic Day: మరోసారి కేరళ శకటాన్ని తిరస్కరించిన రక్షణశాఖ

పట్టుబడిన యువకుడు పశ్చిమబెంగాల్ లోని నిత్యానంద్ కఠి గ్రామానికి చెందిన వాడుగా సెక్యూరిటీ అధికారులు గుర్తించారు. గ్రామానికి చెందిన మరొక వ్యక్తి ఈ చిలుకలను యువకుడికి అందించాడు. చిలుకలు చెప్పినచోటకి తరలిస్తే యువకుడికి రూ.1000 దినసరి కూలీ లభిస్తుందని, కేవలం కూలీ కోసమే యువకులు ఈ చిలుకలను అక్రమంగా తరలిస్తున్నట్లు BSF అధికారులు పేర్కొన్నారు. పట్టుబడిన 140 రామచిలుకలను.. తరాలి గ్రామంలోని పక్షుల సంరక్షణ కేంద్రానికి తరలించనున్నట్లు అధికారులు వివరించారు. మరింత సమాచారం కోసం యువకుడిని టెంటులియాలోని కస్టమ్స్ కార్యాలయానికి తరలించారు. కాగా దేశాల మధ్య వన్యప్రాణులను తరలించడం ఇరు దేశాల చట్టప్రకారం నేరం.

Also Read: Train Derailed: రైలు ప్రమాద బాధితులను పరామర్శించిన కేంద్ర మంత్రి