Balochistan
Balochistan: భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్థాన్ కు మరో ఎదరుదెబ్బ తగిలింది. పాకిస్థాన్ లోనే అతిపెద్ద ప్రావిన్స్ (విస్తీర్ణం పరంగా) అయిన బలూచిస్థాన్ పాకిస్థాన్ ప్రభుత్వానికి బిగ్ షాకిచ్చింది. పాకిస్థాన్ నుంచి మేము విడిపోతున్నట్లు బలూచిస్తాన్ నేతలు ప్రకటించుకున్నారు.
బలూచిస్తాన్ ఇక స్వతంత్ర దేశమని, తమను ఇకపై పాకిస్తానీలుగా కాకుండా బలూచిస్తాన్ పౌరులుగా గుర్తించాలని బలూచ్ ఉద్యమ నేత మీర్ యార్ బలూచ్ బుధవారం ప్రకటించారు. భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ బలూచిస్తాన్ ను స్వతంత్ర దేశంగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.
‘‘బలూచ్ ప్రజలపై పాకిస్థాన్ దశాబ్దాల తరబడి అణచివేతలు, నరమేధానికి పాల్పడింది. దశాబ్దాల తరబడి సాగిన హింసాకాండ, భద్రతా బలగాల ద్వారా కిడ్నాప్ లు, మానవ హక్కుల ఉల్లంఘనల నుంచి విముక్తి కోసం పాకిస్థాన్ నుంచి స్వతంత్రాన్ని ప్రకటించుకుంటున్నాం.’’ అని ఎక్స్ లో వరుస ట్వీట్లు చేశారు. అంతేకాక.. బలూచిస్తాన్ లో ఉన్న పాకిస్థాన్ బలగాలు, ప్రభుత్వ సిబ్బంది అంతా వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు. బలూచిస్తాన్ ప్రజలంతా వీధుల్లోకి వచ్చి గొంతెత్తి తీర్పును ప్రకటించారు.
బలూచిస్తాన్ ఇకనుంచి పాకిస్థాన్ కాదు. భారత్ సహా ప్రపంచ దేశాలు బలూచిస్తాన్ ను ప్రత్యేక దేశంగా గుర్తించాలని మీర్ యార్ కోరారు. ఐక్యరాజ్య సమితి బలూచిస్తాన్ ను ‘డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ గా గుర్తించి వెంటనే శాంతి పరిరక్షక దళాన్ని పంపాలని విజ్ఞప్తి చేశారు. పీవోకేపై భారత్ కు తాము పూర్తి మద్దతును ఇస్తున్నామని ఈ సందర్భంగా మీర్ యార్ ప్రకటించారు.
‘Balochistan is not Pakistan’: Baloch leader declares independence from Pakistan, seeks support from India and global community
Read @ANI Story | https://t.co/UEs2q80hyd#Balochistan #Pakistan #India #independence pic.twitter.com/vR5s9Si2vk
— ANI Digital (@ani_digital) May 14, 2025