Afghanistan : ఇకపై అక్కడ మహిళల బ్యూటీపార్లర్లపై నిషేధం అమలు

తాలిబాన్ కొత్త డిక్రీ జారీ చేసిన తర్వాత కాబూల్ తో పాటు దేశ వ్యాప్తంగా ఇతర ప్రావిన్సులలో మహిళల బ్యూటీ సెలూన్లను నిషేధించింది. ఈ ఉత్తర్వు ప్రకారం జూలై 23 తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల బ్యూటీ పార్లర్ లు పనిచేయడానికి అనుమతి లేదు.

Afghanistan

Afghanistan : ప్రజల నిరసనలు, ఐక్యరాజ్య సమితి ఆందోళనల మధ్య ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల బ్యూటీ పార్లర్లపై నిషేధం అమలులోకి వచ్చింది. ఈ ఉత్తర్వు ప్రకారం జూలై 23 తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లోని మహిళల బ్యూటీ సెలూన్లు పనిచేయడానికి అనుమతించబడవు.

Afghanistan : బ్యూటీ పార్లర్స్ మూసేయాలి.. మహిళలకు తాలిబన్‌ ప్రభుత్వం హెచ్చరిక

తాలిబాన్ కొత్త డిక్రీ జారీ చేసిన తర్వాత కాబూల్‌తో పాటు దేశ వ్యాప్తంగా ఇతర ప్రావిన్సులలో మహిళల బ్యూటీ సెలూన్లను నిషేధించింది. ఈ ఉత్తర్వు ప్రకారం జూలై 23 తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల బ్యూటీ పార్లర్ లు పనిచేయడానికి అనుమతించబడవు. మహిళల బ్యూటీ సెలూన్లను బలవంతంగా మూసివేయడం వల్ల వారి ఆర్ధిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. సెక్రటరీ జనరల్ ఫర్హాన్ హక్ డిప్యూటీ స్పోర్స్ పర్సన్ కూడా తాలిబాన్ అధికారులను బ్యూటీ సెలూన్లను మూసివేసే ఆదేశాన్ని నిలిపివేయాలని కోరినట్లు తెలుస్తోంది.

Afghanistan: మా దేశానికి తిరిగి రండి..! హిందువులు, సిక్కులను కోరిన తాలిబాన్లు.. ఎందుకంటే?

మరోవైపు కొందరు మహిళలు నిషేధం తర్వాత తమ కుటుంబాన్ని పోషించుకోలేరని బ్యూటీ సెలూన్ల యజమానులు చెబుతున్నారు. తాలిబాన్ డిక్రీ జారి చేసిన కొన్ని రోజుల తర్వాత అనేక మంది మహిళా మేకప్ ఆర్టిస్టులు ఈ చర్యకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఆర్డర్‌ను రద్దు చేయాలని కోరారు.