Afghanistan: మా దేశానికి తిరిగి రండి..! హిందువులు, సిక్కులను కోరిన తాలిబాన్లు.. ఎందుకంటే?

తమ దేశం నుంచి వెళ్లిపోయిన హిందువులు, సిక్కులు సహా మైనార్టీలు ఆప్ఘనిస్థాన్ కు తిరిగి రావొచ్చని, ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని తాలిబాన్లు విజ్ఞప్తి చేశారు. ఆప్ఘనిస్థాన్ లో శాంతిభద్రతలు పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు.

Afghanistan: మా దేశానికి తిరిగి రండి..! హిందువులు, సిక్కులను కోరిన తాలిబాన్లు.. ఎందుకంటే?

Afganistan

Afghanistan: తమ దేశం నుంచి వెళ్లిపోయిన హిందువులు, సిక్కులు సహా మైనార్టీలు ఆప్ఘనిస్థాన్ కు తిరిగి రావొచ్చని, ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని తాలిబాన్లు విజ్ఞప్తి చేశారు. ఆప్ఘనిస్థాన్ లో శాంతిభద్రతలు పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు. తాలిబాన్ రాష్ట్ర మంత్రి కార్యాలయం డైరెక్టర్ జనరల్ డాక్టర్ ముల్లా అబ్దుల్ వాసీ జూలై 24న హిందూ, సిక్కు కౌన్సిలర్ లోని పలువురు సభ్యులతో సమావేశమైన నేపథ్యంలో ఈ వ్యాఖ్యాలు చేశారు. చీఫ్ ఆఫ్ స్టాఫ్ కార్యాలయం పోస్ట్ విడుదల చేసింది.

Afghanistan: మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు: అఫ్ఘనిస్తాన్

కాబూల్ లో హిందూ, సిక్కు నాయకుల ప్రతినిధి బృందంతో సమావేశమైన ముల్లా అబ్దుల్ వాసీ.. దేశంలో భద్రతా సమస్యల కారణంగా దేశం విడిచిపెట్టిన భారతీయ, సిక్కు స్వదేశీయులందరూ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌కు తిరిగి రావచ్చని అన్నారు. ఇదిలాఉంటే గతంలో తాలిబాన్లు విడుదల సందర్భంగా కాబూల్‌లోని గురుద్వారాపై ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ (ISKP) దాడిని నివారించినందుకు సిక్కు నాయకులు తాలిబాన్లకు కృతజ్ఞతలు తెలిపారు.

Afghanistan earthquake: ‘అఫ్గాన్‌పై ఆంక్ష‌లు ఎత్తేయండి’.. అమెరికాను కోరిన తాలిబ‌న్ స‌ర్కారు

గతకొద్దికాలం క్రితం ఆఫ్గనిస్థాన్ లోని మైనారిటీ మత సంస్థలపై వరుస దాడులు జరిగాయి. సిక్కు కమ్యూనిటీతో సహా, ఇస్లామిక్ స్టేట్‌లో హింస లక్ష్యంగా కొనసాగాయి. జూన్ 18న ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ (ISKP) కాబూల్‌లోని కార్తే పర్వాన్ గురుద్వారాపై దాడి జరిగింది, ఇందులో సిక్కుతో సహా ఇద్దరు వ్యక్తులు మరణించారు. 2021 అక్టోబర్ లో కాబూల్‌లోని కార్ట్-ఎ-పర్వాన్ జిల్లా గురుద్వారాలోకి ప్రవేశించిన 15 నుండి 20 మంది ఉగ్రవాదులు గార్డులను కట్టివేశారు. మార్చి 2020లో.. కాబూల్‌లోని షార్ట్ బజార్ ప్రాంతంలోని శ్రీ గురు హర్ రాయ్ సాహిబ్ గురుద్వారా వద్ద జరిగిన ఘోరమైన దాడిలో 27 మంది సిక్కులు మరణించారు, అనేకమంది గాయపడ్డారు. ఈ దాడికి తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రకటించారు. ఈ క్రమంలో ఆ దేశంలోని హిందువులు, సిక్కులు, మైనార్టీలు ఇతర దేశాలకు వలసలు వెళ్లారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఆప్ఘనిస్థాన్ లో ప్రశాంత వాతావరణం నెలకొందని, మీరంతా తిరిగి మన దేశానికి రావాలని తాలిబన్లు హిందువులు, సిక్కుల ప్రతినిధుల సమావేశంలో కోరారు.