Afghanistan : బ్యూటీ పార్లర్స్ మూసేయాలి.. మహిళలకు తాలిబన్ ప్రభుత్వం హెచ్చరిక
తాలిబన్ ప్రభుత్వం మహిళలపై మరో సారి ఆంక్షలు విధించింది. మహిళా బ్యూటీ పార్లర్లపై ఉక్కుపాదం మోపింది. బ్యూటీ పార్లర్లు మూసేయాలని హుకుం జారీ చేసింది.

taliban govt banned women buaty selons
Afghanistan taliban govt: అఫ్గానిస్థాన్ (Afghanistan) లో తాలిబన్ల ప్రభుత్వం (taliban govt) వచ్చినప్పటినుంచి బాలికలు, యువతులు, మహళలపై అంతులేని ఆంక్షలు విధిస్తు జీవితాలను దర్భురం చేస్తున్నారు. బాలికల విద్యపై ఆంక్షలు, యువతులు యూనివర్శిటీల్లో చదవకూడదని, మీడియాలో పనిచేసే ఉద్యోగినులు మొహం కనిపించకుడదని..జర్నలిస్టు ముఖాలు కప్పుకుని న్యూస్ చదవాలని ఇలా చెప్పుకుంటు పోతే ఆడపుట్టుకమీదనే అంతులేని ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు కొనసాగుతున్న క్రమంలో తాలిబన్ ప్రభుత్వం మరో సారి హెచ్చరికలు జారీ చేసింది.ఈసారి మహిళా బ్యూటీ పార్లర్లపై ఉక్కుపాదం మోపింది. బ్యూటీ పార్లర్లు ( women buaty selons)మూసేయాలని హుకుం జారీ చేసింది.
మంగళవారం (జులై4,2023)న ప్రభుత్వ ప్రతినిథి ఆదేశాలు జారీ చేశారు. అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ లో మహిళా బ్యూటీ సెలూన్‌లపై తాలిబన్ ప్రభుత్వం నిషేధం విధించింది. బ్యూటీ పార్లర్లు మూసివేయాలని ఆదేశాలు జారీచేశారు. ఇక నుంచి మహిళలు బ్యూటీ పార్లర్లు నడపకూడదని మంత్రి మహ్మద్ అకిఫ్ మహజర్ (Mohammad Sidik Akif Mahajar)కాబుల్ నగర మున్సిపాలిటి (Kabul City Municipality)కి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలపై మేకప్ ఆర్టిస్టులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వృత్తిపై ఇటువంటి ఆంక్షలా ఎలా బత్రకాలి అంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఈ ఆదేశాలు వెలువడిని క్రమంలో ఆయా బ్యూటీ పార్లర్లకు నోటీసులు జారీ చేయబడతాయి. నెల రోజుల్లో వాటిని మూసివేయాలి. ఆ తరువాత వాటిని తెరవకూడదు. మూసివేసినట్లుగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి. ఈ ఆదేశాలు కాదని ఎవరన్నా పార్లర్లు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. 2021 ఆగస్టులో అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబన్లు ఇష్టానుసారంగా ప్రజలపై మరి ముఖ్యంగా మహిళలపై వారి స్వేచ్ఛపై అంతులేని ఆంక్షలు విధిస్తున్నారు.