బంగ్లాదేశ్‌లో చిన్మయ్ కృష్ణదాస్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ
న్యాయస్థానంలో అరగంటపాటు ఈ పిటిషన్‌పై వాదనలు జరిగాయి.

chinmoy krishna das
ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్ బెయిల్ పిటిషన్‌ను బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ కోర్టు తిరస్కరించింది. దేశ ద్రోహం నేరారోపణతో బంగ్లాదేశ్ పోలీసులు ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉంటున్నారు.
ఆయనకు బెయిల్ కోసం 11 మంది న్యాయవాదుల బృందం ప్రయత్నించింది. అయినప్పటికీ ఆయనకు ఊరట దక్కలేదు. న్యాయస్థానంలో అరగంటపాటు ఈ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. వాదన నేపథ్యంలో ఇవాళ కోర్టు వద్ద భద్రతను పెంచారు. ఈ కేసులోని తీవ్రత దృష్ట్యా ఇప్పుడు ఆయనకు బెయిల్ ఇవ్వలేమని కోర్టు తెలిపింది.
న్యాయవాది అపూర్బ కుమార్ భట్టాచార్జీ దీనిపై మీడియాతో మాట్లాడుతూ.. తాము ఐంజీబీ ఐక్య పరిషత్ బ్యానర్‌తో ఇక్కడకు వచ్చామని తెలిపారు. చిన్మయ్ కృష్ణదాస్ బెయిల్ కోసం కోర్టులో ప్రయత్నిస్తూనే ఉంటామని చెప్పారు. తాను నేను సుప్రీంకోర్టు, చిట్టగ్రామ్ బార్ అసోసియేషన్‌లలో సభ్యుడినని అన్నారు.
కాగా, గత ఏడాది నవంబరులో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న చిన్మయ్.. బంగ్లాదేశ్ జాతీయ జెండాను అగౌరవపరిచారనే ఆరోపణలతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. సమ్మిళిత సనాతన జాగరణ్ జోతే సంస్థ చిన్మోయ్ తరఫున వాదించేందుకు 11 మందితో లాయర్ల బృందాన్ని ఏర్పాటు చేసింది.
తెలంగాణలో బాలికల గురుకులాలపై ఫోకస్.. అదనపు కలెక్టర్లు పర్యవేక్షించాలని ప్రభుత్వం ఆదేశాలు