Plastic Surgery: ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న బ్యూటీ క్వీన్.. నవ్వడమే కాదు కళ్లు మూయడానికి కూడా లేదు!
రష్యా బ్యూటీ క్వీన్ ప్లాస్టిక్ సర్జరీ మొఖాన్ని మార్చేయడంతో పాటు కళ్లు కూడా మూయలేని పరిస్థితిలో పడేసింది. రూ.3లక్షలు ఖర్చు పెట్టి వయస్సు రీత్యా వచ్చిన ముడతలు తొలగించుకునేందుకు.....

Russian Beauty (1)
Plastic Surgery: రష్యా బ్యూటీ క్వీన్ ప్లాస్టిక్ సర్జరీ మొఖాన్ని మార్చేయడంతో పాటు కళ్లు కూడా మూయలేని పరిస్థితిలో పడేసింది. రూ.3లక్షలు ఖర్చు పెట్టి వయస్సు రీత్యా వచ్చిన ముడతలు తొలగించుకునేందుకు వెళ్లిన ఆమెకు ఈ చేదు అనుభవం ఎదురైంది.
రెండేళ్ల క్రితం మిస్సెస్ ఇంటర్నేషనల్ కాంటెస్ట్‌లో రన్నరప్ యులియా తారాసేవిచ్ (43) ప్లాస్టిక్ సర్జరీ కోసం టాప్ క్లినిక్ కు వెళ్లింది. అందమైన ముఖంతో వాళ్ల దగ్గరకు వెళ్లగా మొత్తం ఆరోగ్యమే పాడైందని వాపోయింది.
‘వయస్సు రీత్యా వచ్చిన ముడతలు తొలగించుకునేందుకు క్లినిక్ కు వెళ్లా. కనురెప్పలపై బ్లేఫారోప్లాస్టీ సర్జరీతో పాటు దవడల భాగంలో కొవ్వును తొలగించమని చెప్పా’ అంటూ వాపోయింది.
Read Also : రకుల్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోలేదా??
సర్జరీ కారణంగా వచ్చిన నెక్రోసిస్ సమస్యకు అర్జెంటుగా మరో సర్జరీ చేయాల్సి వస్తుందని డాక్టర్ చెప్పడంతో ఒరిజినల్ ఆపరేషన్ చేసిన డాక్టర్లపై కంప్లైంట్ చేసింది. విచారణలో ఆ మహిళకు స్క్లెరోడెర్మా అనే అరుదైన జెనెటిక్ సమస్య కారణంగా ఇలా జరిగిందని చెప్పారు. ఇది పూర్తిగా ఆమెకు స్వతహాగా వచ్చిన సమస్యేనని తప్పుకున్నారు.
స్క్లెరోడెర్మా అనే కండిషన్ చర్మాన్ని మందంగా మార్చడమే కాకుండా కొన్నిసార్లు బిగుసుకుపోయేలా చేస్తుంది. అంతర్గత అవయవాలతో పాటు, రక్త కణాల్లో కూడా సమస్యలు వస్తాయి. ఇదంతా చర్మం కింది పొరల్లో ఉండే భాగం ఇమ్యూన్ సిస్టమ్ పై దాడి చేయడం కారణంగానే జరుగుతుందని వైద్యులు అంటున్నారు.

Russian Beauty
కాకపోతే బాధితురాలు ఇదే సమస్యతో బాధపడుతున్నట్లు ఎటువంటి సాక్ష్యం చూపించలేకపోయారు.
Read Also : ముక్కు సర్జరీకి వెళ్తే ప్రాణమే పోయింది.. ప్రైవేట్ హాస్పిటల్ లో దారుణం.. !
నా కళ్ల దగ్గరి శరీర భాగం బిగుసుకుపోయింది. కళ్లు మూయలేకపోతున్నా. నవ్వలేకపోతున్నా. పైన పెదవి కదలడం లేదు. నా శరీరంలో ఒక భాగం అస్సలు పనిచేయడం లేదని తెలుసుకున్నా. వెంటనే టెస్టుల కోసం వెళ్లా. దాని కంటే ముందు ప్లాస్టిక్ సర్జరీ జరిగింది. జెనెటిక్ సమస్యలతో సంబంధం లేకుండా ప్లాస్టిక్ సర్జరీ ఫెయిల్ అయింది.
ఈ డ్యామేజి రికవరీ చేసుకోవడం కోసం దాదాపు రూ.20లక్షల వరకూ ఖర్చు అయింది. అయినప్పటికీ తిరిగి తన అందం తాలూకు ఛాయలు కూడా కనిపించలేదు. ఈ మొత్తానికి సర్జన్లే కారణమని.. సరైన పద్ధతిలో చేయకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందని చెప్పి వాపోయింది.