New York : ఆ సిటీ మొత్తాన్ని చుట్టుముట్టిన తేనెటీగలు.. ఇబ్బంది పడుతున్న జనం

కొద్దిరోజుల క్రితమే అడవిలో మంటల కారణంగా న్యూయార్క్ నగరం వాయు కాలుష్యంతో ఆరంజ్ కలర్‌లోకి మారిపోయింది. తాజాగా సిటీపై తేనెటీగలు దాడి చేశాయి. ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా చేరి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశాయి.

New York

New York : ఎక్కడైనా రెండు మూడు తేనెటీగలు కనిపిస్తే ఆమడ దూరం పరుగులు పెడతాం. అవి కుడితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాంటిది సిటీ మొత్తం తేనెటీగలతో నిండిపోతే.. న్యూయార్క్ నగరాన్ని తేనెటీగలు ముంచెత్తాయి. మరి అక్కడి వారి పరిస్థితి ఎలా ఉందో ఊహించగలం.

New York : న్యూయార్క్‌లో ఆరంజ్ కలర్‌లోకి మారిన ఆకాశం.. కారణం అదే..

న్యూయార్క్ నగరాన్ని తేనెటీగల చుట్టుముట్టాయి. డిజిటల్ సృష్టికర్త మరియు జంతుశాస్త్రవేత్త మిచల్ బ్లాంక్ ఇన్‌స్టాగ్రామ్‌లో mickmicknyc ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఫుటేజ్‌లో ఎక్కడ చూసిన గాలిలో తేనెటీగలు గుంపులు గుంపులుగా కనిపిస్తున్నాయి. కొన్ని హోటళ్లు, టెర్రస్‌లపై కూడా కనిపించాయి. ఇవి కుడితే దద్దుర్లతో తీవ్ర ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇక్కడికి ఇంత మొత్తంలో తేనెటీగలు ఎందుకు దాడి చేసాయో అర్ధం కాలేదు. స్ధానికులు మాత్రం తీవ్ర ఆందోళనతో అధికారులకు ఫిర్యాదు చేశారు.  అధికారులు వాటి నుంచి జనాన్ని కాపాడటానికి తేనెటీగలకు సంబంధించిన ఎక్స్‌పర్ట్‌ని సంప్రదించారట. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

New York : భూమిలోకి కుంగిపోతున్న న్యూయార్క్ నగరం.. ఎందుకో తెలుసా?

ఇవి ఇలా ఎందుకు వచ్చాయో తెలుసుకోవడం మంచిది అని ఒకరు.. అక్కడి జనం వీటి నుంచి రక్షించబడాలి అంటూ కామెంట్లు చేసారు. తేనెటీగలు సహజంగానే కొత్త భూభాగాన్ని వెతుక్కుంటూ వెళతాయని బ్లాంక్ చెబుతున్నారు. ఈ వీడియో అప్ లోడ్ చేసి రెండు రోజులు కావొస్తోంది. బహుశా అక్కడి వారు తేనెటీగల బారినుంచి పూర్తిగా రక్షించబడి ఉంటారని నెటిజన్లు భావిస్తున్నారు.