New York : న్యూయార్క్‌లో ఆరంజ్ కలర్‌లోకి మారిన ఆకాశం.. కారణం అదే..

న్యూయార్క్ వాయు కాలుష్యంలో చిక్కుకుంది. అడవి మంటల కారణంగా పలు నగరాల్ని దట్టమైన పొగ కమ్మేయడంతో ఆకాశం ఆరంజ్ కలర్‌లోకి మారిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

New York : న్యూయార్క్‌లో ఆరంజ్ కలర్‌లోకి మారిన ఆకాశం.. కారణం అదే..

New York

New York – Viral Video : న్యూయార్క్ నగరం అడవి మంటల కారణంగా భయంకరమైన కాలుష్యంతో పోరాడుతోంది. నగరం మొత్తం పొగతో నిండిపోయి ఆకాశం ఆరంజ్ రంగులోకి మారిపోయింది. వింత దృశ్యం యొక్క ఫోటోలను న్యూయార్క్ వాసులు సోషల్ మీడియా (Social Media)లో షేర్ చేసుకున్నారు.

Sofa flew in the air : గాలిలో ఎగిరి భవనాన్ని ఢీకొట్టిన సోఫా.. ఆకాశంలో వింత దృశ్యం

కెనడియన్ అడవి మంటల నుండి US ఈస్ట్ కోస్ట్ మరియు మిడ్ వెస్ట్‌లోకి పొగలు రావడంతో న్యూయార్క్ నగరం భయంకరమైన వాయు కాలుష్యాన్ని ఎదుర్కుంటోంది. ఇంతకుముందు ఢిల్లీలో కనిపించిన కాలుష్యాన్ని మించి అధికస్ధాయిలో ఈ కాలుష్యం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోను చెఫ్ వికాస్ ఖన్నా Vikas Khanna తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసారు. “ఇది మార్స్ మీద మధ్యాహ్నం 1 గంట, నా ఉద్దేశ్యం న్యూయార్క్ నగరం” అనే శీర్షికను యాడ్ చేశారు. కొందరు ఈ పరిస్థితిని ‘అపోకలిప్టిక్ హెల్‌స్కేప్’ అని కూడా పిలిచారు. రహదారులు కనిపించనంతగా పొగ కమ్మేసింది.

Strange Cloud In Turkey : ఆకాశంలో అద్భుతం .. ఫ్లైయింగ్ సాసర్ లాంటి వింత మేఘం

వాయు కాలుష్యం కారణంగా న్యూజెర్సీలోని నెవార్క్ లిబర్టీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు మరియు న్యూయార్క్ నగరంలోని లాగార్డియా విమానాశ్రయంలో రాకపోకలు ఇబ్బందిగా మారాయి. దట్టమైన పొగతో పాటు ఒక రకమైన వాసన.. చీకటి నిండిన ఆకాశంతో మనుష్యులు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారింది. ఈ పరిస్థితి మరీ ఎక్కువగా మేరీల్యాండ్ నుండి న్యూ హ్యాంప్‌షైర్ వరకు ఉన్న నగరాల్లో ఎక్కువగా కనిపించింది