Sofa flew in the air : గాలిలో ఎగిరి భవనాన్ని ఢీకొట్టిన సోఫా.. ఆకాశంలో వింత దృశ్యం

గాల్లో సోఫా ఎగురుతున్న వింత దృశ్యం ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. అంకారాలో తుఫాను కారణంగా వీచిన భయంకరమైన గాలులకు సోఫాలే కాదు.. ఇంటి పైకప్పులు, కిటికీలు ఎగిరిపోయాయట.. రోడ్లపైకి వస్తే ఇంక మనుష్యుల పరిస్థితి ఏమయ్యేదో?

Sofa flew in the air : గాలిలో ఎగిరి భవనాన్ని ఢీకొట్టిన సోఫా.. ఆకాశంలో వింత దృశ్యం

Sofa flew in the air

viral video on Twitter : టర్కీలో తుఫాను భీభత్సం సృష్టించింది. భయంకరమైన గాలులతో చెట్లు, భవనాల పైకప్పులు, కిటికీలు ఎగిరిపోయాయి. ఓ సోఫా గాల్లో ఎగరడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

People wash dishes with mud : ప్లేట్లను ఇలా కూడా శుభ్రం చేస్తారా? వింత వీడియో చూసి నవ్వుకుంటున్న జనం

గాలిలో సోఫా ఎగురుతున్న వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. దీనిని చూసిన జనం ఆశ్చర్యపోతున్నారు. అయితే అది టర్కీలోని అంకారాలో వచ్చిన తుఫాను సమయంలో తీసిన వీడియో. నగరంలో వీచిన భయంకరమైన గాలులకు ఒక ఎత్తైన భవనం నుంచి సోఫా ఎత్తబడి అలా గాలిలో ఎగిరి ఓ భవనాన్ని ఢీ కొట్టింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. అయితే ఇక్కడ తుఫాను ఎంతటి భీభత్సాన్ని సృష్టించిందో అర్ధం చేసుకోవచ్చును.

Delhi Metro : స్కర్ట్‌లు ధరించి మెట్రో ఎక్కిన అబ్బాయిలు.. వింత పోకడలకు మండిపడుతున్న ప్రయాణికులు

అంకారాలో గంటకు 45 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు తీవ్ర నష్టం జరిగింది. చాలా భవనాలు దెబ్బతిన్నాయి. కిటికీలు ఎగిరిపోయాయి. చెట్లు నేల కూలాయి. కొన్ని వస్తువులు, శిథిలాలు గాల్లో ఎగిరిపోయాయి. అంకారా మెట్రోపాలిటన్ మున్సిపాలిటీకి చెందిన మేయర్ మన్సూర్ అక్కడి పరిస్థితులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. అక్కడి ప్రజల అనుభవాలను కూడా సోషల్ మీడియాలో తెలుసుకున్నారు. తుఫాను తర్వాత జరిగిన బీభత్సానికి సంబంధించి ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేశారు.