People wash dishes with mud : ప్లేట్లను ఇలా కూడా శుభ్రం చేస్తారా? వింత వీడియో చూసి నవ్వుకుంటున్న జనం

గుంపులు గుంపులుగా కూర్చుని మట్టితో పాత్రలు క్లీన్ చేస్తున్నారు. పాత్రలు శుభ్రం చేయడంలో మట్టిని కూడా వాడతారు.. కానీ అందుకు భిన్నంగా కనిపించిన సీన్ చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. పాత్రల ఈ వింత క్లీనింగ్ ఏంటో చూడండి.

People wash dishes with mud : ప్లేట్లను ఇలా కూడా శుభ్రం చేస్తారా? వింత వీడియో చూసి నవ్వుకుంటున్న జనం

People wash dishes with mud

Updated On : May 14, 2023 / 9:17 AM IST

Viral News : ఇంట్లో వంటకు వాడిన సామాగ్రిని సబ్బుతో, నీళ్లతో క్లీన్ చేసుకుంటాం. కానీ ఓ పార్టీలో రాశిగా పోసిన మట్టిలో ప్లేట్లు క్లీన్ చేస్తున్నారు.. ఇదేం చిత్రం అనుకోకండి.. ఈ వీడియో మిలియన్ వ్యూస్ దాటి దూసుకుపోతోంది.

Cow comforting a child : పసిబిడ్డను ఓదారుస్తున్న ఆవు.. వైరల్ అవుతున్న క్యూట్ వీడియో

ఇంట్లో స్టీలు సామాన్లు, ఇత్తడి.. రాగి.. వెండి దేనికైనా రకరకాల సబ్బులు, పౌడర్లు వేసి క్లీన్ చేసుకుంటాము. కానీ ఓ పార్టీలో రాశిగా పోసిన ఇసుకలో కొంతమంది ప్లేట్స్ క్లీన్ చేస్తున్నారు. వింతగా అనిపించినా అక్కడ ఇదే సీన్ కనిపించింది. ఇక మరోవైపు మరికొంతమంది కూర్చుని తోమిన ప్లేట్స్‌ని నీటితో శుభ్రపరుస్తున్నారు. ఇలా గిన్నెలు కడగటం ఇంతకుముందు ఎవరూ చూసి ఉండకపోవచ్చును. అయితే ఇలా శుభ్రం చేయడం ద్వారా ప్లేట్స్‌కి ఉన్న ఆయిల్ క్లియర్ అవుతుందట. బహుశా సబ్బు కూడా ఆదా అవుతుందనుకున్నారో ఏమో?.  @IniAlalalannn అనే ట్విట్టర్ యూజర్ ద్వారా పోస్ట్ చేయబడిన ఈ వీడియో చూసి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Kushi : సమంతకి తెలియకుండా తనతోనే ఇన్‌స్టా రీల్ చేసిన విజయ్ దేవరకొండ.. వీడియో వైరల్!

“ఇలా చేయడం ద్వారా పర్యావరణానికి హాని జరగని ఒకరు .. ప్లేట్లలోని నూనెని పీల్చుకోవడానికి ఇలా శుభ్రపరుస్తారని ఇంకొకరు..సబ్బు కొనక్కర్లేకుండా డబ్బుని ఆదా చేయడానికి ఇలా” అని మరొకరు కామెంట్లు జోడించుకుంటూ వెళ్లారు. ఇలా క్లీన్ చేయాలంటే సబ్బు ఆదా అవుతుంది సరే.. అందుకోసం మట్టి కావాలి.. ఆ తర్వాత దానిని క్లీన్ చేసుకోవాలి. ఇది కూడా డబ్బు, శ్రమతో కూడుకున్నదే కదా.. ఏమో ఈ ఇంటర్నెట్ దునియాలో ఇలాంటి విచిత్రాలు మరీ ఎక్కువయ్యాయి ఈ మధ్య అని జనం నవ్వుకుంటున్నారు.