Delhi Metro : స్కర్ట్‌లు ధరించి మెట్రో ఎక్కిన అబ్బాయిలు.. వింత పోకడలకు మండిపడుతున్న ప్రయాణికులు

వైరల్ పిచ్చి ముదురుతోంది. అందుకోసం ఏం చేయడానికైనా కుర్రకారు ఫీల్ అవ్వట్లేదు. తాజాగా ఇద్దరు కుర్రాళ్లు స్కర్ట్లు ధరించి ఢిల్లీ మెట్రో ఎక్కారు. వింత పోకడలు చూసి జనం మండిపడుతున్నారు.

Delhi Metro : స్కర్ట్‌లు ధరించి మెట్రో ఎక్కిన అబ్బాయిలు.. వింత పోకడలకు మండిపడుతున్న ప్రయాణికులు

Delhi Metro

Updated On : April 21, 2023 / 9:08 AM IST

ఓవైపు రద్దీగా ఉంటున్న మెట్రోలు..మరోవైపు మండుతున్న ఎండలు.. వెరసి ప్రయాణికులకు ఇబ్బంది పెడుతుంటే కొందరు ప్రయాణికుల రీల్స్ పిచ్చి ముదురుతోంది. ఢిల్లీ మెట్రో (delhi metro) ఎప్పుడూ వీటికి ఫేమస్సే కదా.. తాజాగా ఇద్దరు కుర్రాళ్లు డెనిమ్ స్కర్ట్స్ (denim skirts) వేసుకుని మెట్రో ఎక్కారు.

Delhi Metro : ఢిల్లీ మెట్రోలో ఇద్దరు మహిళల మధ్య రచ్చ.. పెప్పర్ స్ప్రే ప్రయోగించిన మహిళ వీడియో వైరల్

ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక బస్సులను ఆశ్రయించేవారు సైతం మెట్రో బాట పడుతున్నారు. దాంతో మెట్రోలన్నీ ఫుల్ అయిపోతున్నాయి. ఓవైపు నిలబడటానికే చోటు లేదంటే ఇక మెట్రోల్లో కుర్రకారు తమ రీల్స్, వీడియోలు మాత్రం ఆపట్లేదు. తాజాగా ఢిల్లీలో ఓ అమ్మాయి డ్యాన్స్ వీడియో వైరల్ అయ్యి నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. ఇక ఇద్దరు కుర్రాళ్లు డెనిమ్ స్కర్ట్స్ ధరించి మెట్రో ఎక్కారు. జనం వారిని వింతగా చూడటం మొదలుపెట్టారు. భవ్యకుమార్, సమీర్ ఖాన్ అనే ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) యూజర్లు పొడవాటి డెనిమ్ స్కర్ట్స్ ధరించి మెట్రో ఎక్కారు. ఏ మాత్రం ఫీల్ కాకుండా వీడియోలకి ఫోజులిచ్చారు. ఇక ఎవరి పిచ్చి వారికి ఆనందం అనుకున్నారో ఏమో.. జనాలు నవ్వుకున్నారు. వీరు షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Delhi Metro : ఢిల్లీ మెట్రో డ్రైవర్ చేసిన పని వైరల్.. అనౌన్స్‌మెంట్‌కి బదులు!

మగవారు ఈ బట్టలు వేసుకోవమేంటని కొందరు.. నవ్వుల ఇమెజీలతో మరికొందరు స్పందించారు. మంచి కాన్సెప్ట్ లతో కొందరు వైరల్ అవుతుంటే.. కొందరు మాత్రం అభాసుపావుతున్నారు. ఏది ఏమైనా వైరల్ అవ్వాలనే క్రేజ్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Sameer Khan (@sameerthatsit)