Strange Cloud In Turkey : ఆకాశంలో అద్భుతం .. ఫ్లైయింగ్ సాసర్ లాంటి వింత మేఘం

ఈ అంతులేని విశ్వంలో ఎన్నో అందాలు..మరెన్నో అద్భుతాలు..ఇంకెన్నో ఆశ్చర్యాలు...ఎన్నో రహస్యాలు. వెరసి ఈ విశ్వం మనిషి మేథస్తుకు ఎప్పుడు సవాల్ విసురుతునే ఉంటుంది. అందాల వినీలాకాశంలో అందాలకు కొదువలేదు. అటువంటి అందాల ఆకాశంలో ఓ వింత కనిపించింది. కనువిందుచేసింది.

Strange Cloud In Turkey : ఆకాశంలో అద్భుతం .. ఫ్లైయింగ్ సాసర్ లాంటి వింత మేఘం

Strange Cloud In Turkey : ఈ అంతులేని విశ్వంలో ఎన్నో అందాలు..మరెన్నో అద్భుతాలు..ఇంకెన్నో ఆశ్చర్యాలు…ఎన్నో రహస్యాలు. వెరసి ఈ విశ్వం మనిషి మేథస్తుకు ఎప్పుడు సవాల్ విసురుతునే ఉంటుంది. అందాల వినీలాకాశంలో అందాలకు కొదువలేదు. అటువంటి అందాల ఆకాశంలో ఓ వింత కనిపించింది. కనువిందుచేసింది. టర్కీ తుర్కియే (టర్కీ) లోని బుర్సా పట్టణంలో ఓ వింత మేఘం కనిపించింది.

ఈ మేఘం ఆకారం అచ్చంగా గ్రహాంతరవాసుల ఫ్లైయింగ్ సాసర్ లా ఉంది.దీన్ని చూసిన బుర్సా పట్టణవాసులు ఆశ్చర్యపోయారు. అది గ్రహాంతరవాసుల ఫ్లైయింగ్ సాసర్ అంటూ ఆశ్చర్యంగా చూశారు. వారి వారి ఫోన్లతో ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఈ వింత మేఘం తెగ వైరల్ అవుతోంది.

గ్రహాంతరవాసులు నేలపైకి వస్తున్నారేమోనని బుర్సా పట్టణవాసులు తెగ భయపడిపోయారట.ఆ తరువాత అది ఫ్లైయింగ్ సాసర్ కాదని ఓ భారీ మేఘం ఇలా విచిత్రమైన ఆకారం దాల్చిందని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఆకాశంలో ఈ వింత మేఘాలు ఏర్పడడంపై తుర్కియే మెటరలాజికల్ సంస్థ ప్రతినిధి వివరించారు.

ఇటువంటి మేఘాలు 2 వేల నుంచి 5 వేల మీటర్ల ఎత్తున్న పర్వత ప్రాంతాల్లో మాత్రమే ఏర్పడతాయని.. ఎత్తైన ప్రదేశాల్లో గాలుల వేగం క్షణక్షణానికీ మారుతుందని, బలమైన గాలులు వీస్తున్నప్పుడు ఉన్నట్టుండి ఇటువంటి మేఘాలు రూపొందుతాయని తెలిపారు. గాలి వేగంలో చోటుచేసుకునే అసాధారణ మార్పులవల్లే ఇలాంటి అసాధారణ మేఘాలు ఏర్పడతాయని వివరించారు. ఈ మేఘాలు కనిపించాయంటే ఆ రోజు లేదా ఆ మరుసటి రోజు వర్షం కురుస్తుందని తెలిపారు.