Vodka తీసుకొంటే కరోనా రాదంటున్నారు Belarus president అలెగ్జాండర్ లుకాషెంకో. తనకు వైరస్ సోకిందని వెల్లడించారు. అయితే…కరోనా వైరస్ ను నిర్మూలించాలంటే…వోడ్కాకు మించిన డ్రగ్ లేదని ఆయన కొత్తగా వెల్లడిస్తున్నారు. పెద్ద పెద్ద క్రీడా కార్యక్రమాలను రద్దు చేయడానికి ఆయన నిరాకరిస్తున్నారు.
లాక్ డౌన్ విధించడానికి ఆయన నో చెబుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ ప్రబలుతున్నా ఆయన..ఐస్ ఆటను ఆడుతున్నారు. రోజుకు 50 ML Vodka తాగడం వల్ల వైరస్ నుంచి రక్షించుకోవచ్చని సలహాలు ఇచ్చారు. ఈ వ్యాధితో ఇప్పటి వరకు 538 మంది చనిపోయారు.
ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకూడదని ఏప్రిల్ నెలలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా ఎవరూ చనిపోరని వెల్లడిస్తున్నారు. తమకు ఇప్పటికే దీనిపై అనుభవం ఉందని, చైనా, అమెరికా, యూరోపియన్ దేశాల్లో ఉన్న వైరస్ ..ఎలా వ్యాపిస్తుందో..తదితర పరిణామాలను గమనిస్తున్నామన్నారు.
ప్రతొక్కరు ధైర్యంగా సానుకూలంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజలు క్రమం తప్పకుండా ఆవిరిని పట్టుకోవాలన్నారు. అయితే..దేశ ప్రజలను ప్రమాదంలో పడేశారని విమర్శలు చేస్తున్నారు.