Monkeypox Quarantine : బెల్జియంలో మంకీపాక్స్‌ బాధితులకు క్వారంటైన్‌ మస్ట్.. ఇదే ఫస్ట్ కంట్రీ..!

Monkeypox Quarantine : ప్రపంచాన్ని వణికించిన కరోనావైరస్ మహమ్మారి తగ్గుముఖం పట్టింది.. కరోనా తీవ్రత తగ్గిందిలే అనుకున్న తరుణంలో మరో వైరస్ విజృంభించింది.

Monkeypox Quarantine : ప్రపంచాన్ని వణికించిన కరోనావైరస్ మహమ్మారి తగ్గుముఖం పట్టింది.. కరోనా తీవ్రత తగ్గిందిలే అనుకున్న తరుణంలో మరో వైరస్ విజృంభించింది. మంకీపాక్స్ అనే వైరస్ ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే ప్రపంచ దేశాల్లో పదుల సంఖ్యలో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.

ఆఫ్రికన్‌ దేశాల్లో బయటపడిన మంకీపాక్స్‌ వైరస్‌ వేగంగా ప్రపంచ దేశాలకు వ్యాప్తిస్తోంది. యూరోపియన్‌ దేశమైన బెల్జియంలో మంకీపాక్స్‌ కేసులు నమోదవుతున్నాయి. దాంతో బెల్జియం ప్రభుత్వం అలర్ట్ అయింది. మంకీపాక్స్ వైరస్‌ సోకినవారికి 21 రోజుల క్వారంటైన్‌ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తద్వారా మంకిపాక్స్‌ బాధితులకు క్వారంటైన్‌ అమలు చేస్తున్న తొలి దేశంగా నిలిచింది.

బెల్జియంలో ఇప్పటివరకు 14 మంకీపాక్స్‌ కేసులు నమోదు కాగా.. అన్ట్‌వెర్ప్‌లో మొదటిసారిగా మంకీపాక్స్‌ కేసు నమోదైంది. ఇప్పటివరకూ నమోదైన అన్ని మంకీపాక్స్ కేసులు అక్కడ బాధితులే ఉన్నారు. ఇటీవల అన్ట్‌వెర్ప్‌లో జరిగిన ఓ వేడుకకు వీరంతా హాజరయ్యారని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

Belgium Becomes First Country To Introduce Monkeypox Quarantine, What We Know About The Virus So Far

మంకీపాక్స్ వైరస్‌ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కరోనావైరస్ తరహాలోనే మంకీపాక్స్ పాజిటివ్‌ వచ్చినవారికి 21 రోజుల క్వారంటైన్‌ను తప్పనిసరి చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికివస్తున్న మంకీపాక్స్‌ వైరస్.. 12 దేశాల్లో ఇప్పటివరకు 80 కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

Read Also : Monkeypox : మంకిపాక్స్ డేంజర్ బెల్స్..పది రోజుల్లోనే 12 దేశాలకు విస్తరించిన వైరస్

ట్రెండింగ్ వార్తలు