Bernard Arnault: ప్రపంచంలో అత్యంత ధనవంతుడు బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఎవరు? ఏ వ్యాపారం చేస్తాడు? మస్క్‌ని ఎలా అధిగమించాడు!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో నెం.1 స్థానాన్ని ఫ్రెంచ్ బహుళజాతి సంస్థ లూయిస్ విట్టన్ సీఈఓ బెర్నార్డ్ ఆర్నాల్ట్ కైవసం చేసుకున్నాడు. సోమవారం ఎలోన్ మస్క్ టెస్లా షేర్లు భారీగా పడిపోయిన తరువాత ఆర్నాల్ట్ ఈ స్థానాన్ని భర్తీ చేశాడు.

Bernard Arnault: ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితాలో నెం.1 స్థానాన్ని స్థానాన్ని ఫ్రెంచ్ బహుళజాతి సంస్థ లూయిస్ విట్టన్ సీఈఓ బెర్నార్డ్ ఆర్నాల్ట్ కైవసం చేసుకున్నాడు. సోమవారం ఎలోన్ మస్క్ టెస్లా షేర్లు భారీగా పడిపోయిన తరువాత ఆర్నాల్ట్ ఈ స్థానాన్ని భర్తీ చేశాడు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. ఆర్నాల్ట్ ఆస్తుల విలువ 186.2 బిలియన్ డాలర్లు. గత కొన్నేళ్లుగా ఆర్నాల్ట్ ఈ జాబితాలో మొదటి 10 స్థానాల్లో ఉన్నారు. ఫ్రాన్స్ కు చెందిన బెర్నార్డ్ ప్రపంచంలోనే అతిపెద్ద లగ్జరీ వస్తువుల కంపెనీ అయిన LVMH Moet Hennessyకి సీఈఓ. ఎలోన్ మస్క్ ప్రస్తుత సంపద 185 బిలియన్ డాలర్లు. కొద్దితేడాతో బెర్నార్డ్ఆ ర్నాల్ట్ మస్క్ కంటే ముందున్నాడు.

Bernard Arnault

బెర్నార్డ్ అర్నాల్ట్ గురించి కొన్ని విషయాలు.. 

ఉత్తర ఫ్రాన్స్‌లోని రౌబైక్స్ లో 1949లో బెర్నార్డ్ ఆర్నాల్ట్ జన్మించారు. అతని తండ్రి, జీన్ లియోన్ ఆర్నాల్ట్. సివిల్ ఇంజనీరింగ్ కంపెనీ ఫెర్రేట్-సావినెల్ యజమాని. బెర్నార్డ్  ఎలైట్ ఇంజనీరింగ్ స్కూల్ ఎకోల్ పాలిటెక్నిక్ నుండి పట్టభద్రుడయ్యాడు. యూఎస్ వెళ్లడానికి ముందు 1981లో కుటుంబ వ్యాపారం ఫెర్రేట్-సావినెల్‌లో పనిచేశాడు. తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ కంపెనీని అభివృద్ధి బాటలో నడిపించాడు.

Bernard Arnault

1984లో ఫ్రాన్స్‌కు తిరిగివచ్చి లగ్జరీ వస్తువుల మార్కెట్‌లోకి ప్రవేశించాడు. ఆర్నాల్డ్ ఒక వస్త్ర సమూహాన్ని కొనుగోలు చేశాడు. ఇది క్రిస్టియన్ డియోర్‌ను కూడా కలిగి ఉంది. నాలుగు సంవత్సరాల తరువాత, అతను కంపెనీ యొక్క ఇతర వ్యాపారాలను విక్రయించాడు. LVMHలో నియంత్రణ వాటాను కొనుగోలు చేశాడు.

Bernard Arnault

ఆర్నాల్ట్ యొక్క ఆర్ట్ సేకరణలో ఆధునిక, సమకాలీన చిత్రాలు ఉన్నాయి. ఇందులో పికాసో, ఆండీ వార్హోల్ రచనలు ఉన్నాయి.

Bernard Arnault

1985లో ప్రసిద్ధి చెందిన, దివాలా తీసిన టెక్స్‌టైల్ కంపెనీ అయిన బస్కోక్ ను ఫ్రెంచ్ ప్రభుత్వం నుండి కొనుగోలు చేశాడు. రెండు సంవత్సరాలలో అతను తొమ్మిది వేల మంది ఉద్యోగులను తొలగించాడు. అతను డియోర్ బ్రాండ్ ను మినహాయించి దాని ఆస్తులను చాలా వరకు విక్రయించాడు.

Bernard Arnault

బెర్నాల్డ్ 2019 సంవత్సరంలో తొలిసారి 100 బిలియన్ డార్లలతో నెట్ వర్త్ క్లబ్ కు చేరుకున్నాడు. ఆ సమయంలో అతనికంటే ముందు వరుసలో అమెజాన్ కు చెందిన జెఫ్ బెజోస్, మైక్రోసాప్ట్ యొక్క బిల్ గేట్స్ మాత్రమే ఉన్నారు.

Bernard Arnault

బెర్నార్డ్ ఆర్నాల్ట్, అతని కుటుంబానికి LVMHలో వాటా ఉంది. LVMH లూయిస్ విట్టన్, మోయిట్ అండ్ చందన్, హెన్నెస్సీ, క్రిస్టియన్ డియోర్, ఫెండి, సెఫోరా, వీవ్ క్లిక్‌కోట్‌తో సహా 70 కంటే ఎక్కువ బ్రాండ్‌లను కలిగి ఉంది. క్రిస్టియన్ డియోర్‌లో బెర్నార్డ్ ఆర్నాల్ట్ 96.5 శాతం వాటాను కలిగి ఉన్నాడు.

Bernard Arnault

2021లో బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఎల్‌వీఎంహెచ్ కూడా అమెరికన్ జ్యూవెలరీ కంపెనీ టిఫనీ & కో ( Tiffany & Co) ను 15.8 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఏదైనా లగ్జరీ బ్రాండ్ ను కొనుగోలు చేయడంలో ఇది అతిపెద్ద డీల్.  బెర్నార్డ్ ఆర్నాల్ట్ గతంలో కూడా అత్యంత ధనవంతుల జాబితాలో మొదటి ర్యాంకుకు చేరుకున్నాడు. డిసెంబర్ 2019 నుంచి జనవరి 2020 వరకు, మే2021లో ఒకసారి ధనువంతుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. అయితే కొంతకాలం తరువాత ఆ స్థానాన్ని ఆర్నాల్ట్ కోల్పోయాడు.

Bernard Arnault

బెర్నార్డ్ ఆర్నాల్ట్ కు ప్రస్తుతం 73ఏళ్లు. సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా యాక్టివ్‌గా ఉండటం తక్కువ. ప్రపంచ కుబేరులో జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ, అరుదుగా బహిరంగ ప్రదేశాల్లో కనిపిస్తాడు. బర్నార్డ్ ఆర్నాల్ట్ రెండు వివాహాలు అయ్యాయి. ఐదుగురు పిల్లలు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం ఎల్‌వీఎంహెచ్ సంస్థలో, దానిఅనుబంధ బ్రాండ్‌లలో పనిచేస్తున్నారు. ఆర్నాల్ట్ రెండవ కుమార్తె ఆంటోయిన ఇటీవల హోల్డింగ్ కంపెనీ క్రిస్టియన్ డియోర్ ఎస్ఈగా తమ విధులు నిర్వహిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు