Ah
Afghanistan అప్ఘానిస్తాన్ విషయంలో అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అఫ్ఘానిస్తాన్‌కు అన్ని ఆయుధాల విక్రయాలను నిలిపివేస్తూ బైడెన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. తాలిబాన్లు అప్ఘానిస్తాన్ ని తమ ఆధీనంలోకి తీసుకున్న మూడు రోజుల తర్వాత అమెరికా నుంచి ఈ ప్రకటన వెలువడింది.
యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ యొక్క రాజకీయ,సైనిక వ్యవహారాల బ్యూరో ఢిఫెన్స్ కాంట్రాక్టర్లకు పంపిన ఓ నోటీసులో.. ఆఫ్ఘనిస్తాన్‌కు పెండింగ్‌లో ఉన్న లేదా పంపిణీ చేయని ఆయుధాల బదిలీలు ప్రస్తుతానికి సమీక్షలో ఉంచబడినట్లు పేర్కొంది. అఫ్ఘానిస్తాన్‌లో వేగంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో.. ప్రపంచ శాంతి, జాతీయ భద్రత మరియు అమెరికా యొక్క విదేశాంగ విధానాన్ని మెరుగుపరచడంలో వారి(తాలిబన్) అనుకూలతను నిర్థారించడానికి పెండింగ్‌లో ఉన్న మరియు జారీ చేసిన ఎగుమతి లైసెన్స్‌లు మరియు ఇతర ఆమోదాలను డైరెక్టరేట్ ఆఫ్ డిఫెన్స్ సేల్స్ కంట్రోల్స్ సమీక్షిస్తున్నట్లు ఆ నోటీసులో తెలిపారు. రక్షణ పరికరాల ఎగుమతిదారుల కోసం రాబోయే రోజుల్లో యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ అప్ డేట్స్ ఇస్తుందని చేస్తుందని నోటీసులో పేర్కొన్నారు.
కాగా, అష్రఫ్ ఘని సర్కార్ పతనం సమయంలో తాలిబాన్లు..పెద్ద సంఖ్యలో అమెరికా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారని పలు రిపోర్ట్ లు నిర్ధారించాయి. తాలిబన్లు స్వాధీనం చేసుకున్నవాటిలో.. అమెరికాకి చెందిన బ్లాక్-హాక్ హెలికాప్టర్లు, A-29 సూపర్ టుకానో యుద్ధ విమానం, M4 కార్బైన్‌లు మరియు M16 రైఫిల్స్ సహా పలు ఆయుధాలు ఉన్నాయి.
కాగా, ఓ నివేదిక ప్రకారం..అప్ఘానిస్తాన్ కి 2020 వరకూ 227 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను అమెరికా విక్రయించింది. స్వీడన్ ప్రధానకేంద్రంగా పనిచేసే స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (Sipri) సేకరించిన డేటా ప్రకారం.. గత ఐదు సంవత్సరాలలో అమెరికా తన ప్రపంచ ఆయుధ ఎగుమతుల వాటాను 37 శాతానికి పెంచింది. యూఎస్ ఆయుధాల ఎగుమతులలో దాదాపు 47 శాతం మధ్యప్రాచ్యానికి వెళ్లగా..ఒక్క సౌదీ అరేబియా మాత్రమే ఇందులో 24 శాతం వాటాను కలిగి ఉంది.
READ Afghan Reserves : తాలిబన్ కి బైడెన్ బిగ్ షాక్..వేల కోట్ల అప్ఘాన్ నిధులు ఫ్రీజ్