Afghan Reserves : తాలిబన్ కి బైడెన్ బిగ్ షాక్..వేల కోట్ల అప్ఘాన్ నిధులు ఫ్రీజ్

వేల కోట్ల డాలర్ల అప్ఘానిస్తాన్ నిధులను అమెరికా ఫ్రీజ్ చేసింది.

Afghan Reserves : తాలిబన్ కి బైడెన్ బిగ్ షాక్..వేల కోట్ల అప్ఘాన్ నిధులు ఫ్రీజ్

Afghan (1)

Afghan Reserves వేల కోట్ల డాలర్ల అప్ఘానిస్తాన్ నిధులను అమెరికా ఫ్రీజ్ చేసింది. యూఎస్ బ్యాంక్ అకౌంట్లలో ఉన్న అప్ఘాన్ ప్రభుత్వ నిల్వలను(డబ్బులు)సోమవారం బైడెన్ ప్రభుత్వం ఫ్రీజ్(ఎవరూ వాటిని తీసుకోవడానికి వీల్లేకుండా చేయడం)చేసినట్లు సమాచారం. అప్ఘానిస్తాన్ ని ఆదివారం పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్ గ్రూప్..యూఎన్ సంస్థల్లో ఉన్న వేల కోట్ల డాలర్లను తీసుకునేందుకు వీల్లేకుండా బైడెన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

కాగా, అంతర్జాతీయ ద్రవ్య నిధి(International Monetary Fund)ప్రకారం…ఈ ఏడాది ఏప్రిల్ నాటికి అఫ్ఘానిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ 9.4 బిలియన్ డాలర్ల రిజర్వ్ ఆస్తులను కలిగి ఉంది. ఈ మొత్తం ఆ దేశ వార్షిక ఆర్థిక ఉత్పత్తిలో 1/3వ వంతు. అయితే,అసలు విషయం ఏంటంటే…ఆ నిల్వలలో ఎక్కువ భాగం ప్రస్తుతం అఫ్ఘనిస్తాన్‌లో లేవు. వాటిలో బిలియన్ డాలర్లు యునైటెడ్ స్టేట్స్‌లో ఉంచబడ్డాయని సమాచారం. అయితే ఎంత మొత్తం నిధులు అమెరికాలో ఉంచబడ్డాయనే దానిపై సృష్టత లేదు.

అఫ్ఘన్ ప్రభుత్వం యునైటెడ్ స్టేట్స్‌లో కలిగి ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆస్తులు తాలిబాన్లకు అందుబాటులో ఉండవు అని అమెరికాలోని ట్రెజరీ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఆఫ్ ఫారిస్ అసెట్స్ కంట్రోట్ కి చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

దా అఫ్ఘానిస్తాన్ బ్యాంక్(DAB)గా పిలువబడే అప్ఘానిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ ప్రస్తుత హెడ్ అజ్మల్ అహ్మదీ సోమవారం ఓ ట్వీట్ లో.. అమెరికాలోని నిధులను పొందేందుకు తాలిబాన్ సంస్థ చేస్తున్న ప్రయత్నాన్ని నిరోధించడానికి యూఎస్ ప్రయత్నించినందున డాలర్ల రవాణా నిలిపివేయబడుతుందని తెలిసింది. DAB 9.5 బిలియన్ డాలర్ల ఆస్తులను కలిగి ఉంది, వీటిలో గణనీయమైన భాగం న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ మరియు అమెరికా ఆధారిత ఆర్థిక సంస్థల అకౌంట్లలో ఉంది. తాలిబాన్‌లపై అమెరికా ఆంక్షలు విధించడం వలన వారు ఎలాంటి నిధులను పొందలేరని తెలిపారు.

మరోవైపు,అప్ఘానిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ హెడ్ అజ్మల్ అహ్మదీ మంగళవారం కాబూల్ వదిలి పారిపోయిన విషయం తెలిసిందే. ఏడాది క్రితం అప్ఘానిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ హెడ్ గా నియమితులైన అజ్మల్ అహ్మదీ గతంలో యూఎస్ ట్రెజరీ,వరల్డ్ బ్యాంక్ లో,ప్రైవేట్ సంస్థలో పనిచేశారు. అప్ఘానిస్తాన్ పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోవడానికి దేశం వదిలి పారిపోయిన అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ,అప్ఘానిస్తాన్ సైన్యమే కారణమని సోషల్ మీడియా వేదికగా అహ్మదీ ఆరోపించారు. తాను ఈ విధంగా ముగించాల్సిన అవసరం లేదని..అఫ్ఘన్ నాయకత్వం ఎటువంటి ప్రణాళిక లేకపోవడం వల్ల తాను విసుగు చెందానని..ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా దేశం వదిలి వెళ్లిపోతున్న అప్ఘాన్ నాయకులను తాను కాబూల్ విమానాశ్రయంలో చూశానని అహ్మదీ పేర్కొన్నారు.