US Abortion Law : గర్భస్రావ హక్కును కాపాడే ఉత్తర్వులపై బైడెన్ సంతకం..

రాజ్యాంగ బద్ధంగా లభించిన గర్భస్రావ హక్కును కోల్పోయిన అమెరికన్ మహిళలకు దేశాధ్యక్షుడు జో బైడెన్ గుడ్ న్యూస్ చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో గర్భస్రావం చేయించుకునేందుకు వారికి ఉన్న హక్కును కాపాడే పరిపాలన ఉత్తర్వులపై సంతకం చేశారు.

Biden Moves To Protect Patient Privacy After US Abortion Ruling : 50 ఏళ్ల క్రితమే మహిళలకు అబార్షన్ హక్కు కల్పించిన అగ్రరాజ్యం ఇప్పుడు మాత్రం అవాంఛిత గర్భాన్ని తొలగించుకునే అవకాశాన్ని మహిళలకు లేకుండా రద్దు చేసింది అమెరికా సుప్రీంకోర్టు. దీనిపై అమెరికాలో మహిళలు..ప్రగతిశీల, ప్రజాస్వామ్యవాదులు భగ్గుమన్నారు. ఈక్రమంలో రాజ్యాంగ బద్ధంగా లభించిన గర్భస్రావ హక్కును కోల్పోయిన అమెరికన్ మహిళలకు దేశాధ్యక్షుడు జో బైడెన్ గుడ్ న్యూస్ చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో గర్భస్రావం చేయించుకునేందుకు వారికి ఉన్న హక్కును కాపాడే పరిపాలన ఉత్తర్వులపై సంతకం చేశారు. బైడన్ తీసుకున్న ఈ నిర్ణయంపై యూఎస్ మహిళలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.

ఈ సందర్భంగా బైడెన్ శుక్రవారం మాట్లాడుతూ..అబార్షన్ హక్కులను పునరుద్ధరించటానికి ఫెడరల్ చట్టం వేదగవంతమైన మార్గాన్ని అందించిందని..పురరుత్పత్తి స్వేచ్ఛను పొందేందుకు కొత్త చర్యలను ఆదేశించామని రాబోయే ఎన్నికల్లో ప్రో-ఛాయిస్ శాసనసభ్యులను ఎన్నికోవాలని ఓటర్లను కోరారు. అబార్షన్‌కు రాజ్యాంగ హక్కును తొలగించడానికి సుప్రీం కోర్ట్ తీసుకున్న “భయంకరమైన, తీవ్రమైన” నిర్ణయాన్ని ఖండిస్తున్నామని అన్నారు.

Also read : US SC Judgment Abortions : అబర్షన్ హక్కును రద్దు చేసిన అమెరికా సుప్రీంకోర్టు…ఇతరదేశాలపై ప్రభావం

కాగా మహిళలకు గర్భస్రావ హక్కును రెండు వారాల క్రితం అమెరికన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీనిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఈ క్రమంలో ఆ హక్కును పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలంటూ సొంతపార్టీ అయిన డెమొక్రటిక్ సభ్యుల నుంచి ఒత్తిడి వస్తుండడంతో బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే..ఈ ఉత్తర్వుల వల్ల ప్రయోజనం పరిమితంగానే ఉంటుందని..బైడెన్ పేర్కొన్నారు.

ఈ క్రమంలో తాజా ఉత్తర్వుల వల్ల పరిమిత ప్రయోజనం మాత్రమే ఉండే అవకాశం ఉంది. గర్భస్రావాన్ని సమ్మతించే రాష్ట్రాలకు వెళ్లి, అక్కడి సేవలను వినియోగించుకోవడంలో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తాజా ఉత్తర్వులు రక్షణ కల్పిస్తాయి. అలాగే, గర్భస్రావ హక్కును కాపాడడంలో కోర్టులో పోరాటం మొదలుపెట్టాలని న్యాయ, ఆరోగ్య-మానవ సేవల శాఖను బైడెన్ ఆదేశించారు. కాగా..సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ సంచలన తీర్పుపై యూఎస్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయా రాష్ట్రాలు వారి వారి అభీష్టం మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అబార్షన్‌పై ఇప్పటికే 12 రాష్ట్రాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. అదే సమయంలో మరికొన్ని రాష్ట్రాలు కూడా అదే యోచన చేస్తున్నాయి.

Also read : US Supreme Court : గర్భస్రావ హక్కులపై అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు..!

 

ట్రెండింగ్ వార్తలు