Bird Flu : అంటార్కిటికా ప్రాంతంలో మొట్టమొదటి సారి బర్డ్ ఫ్లూ ముప్పు

అంటార్కిటికా ప్రాంతంలో మొదటిసారిగా బర్డ్ ఫ్లూ వెలుగు చూసింది. ప్రాణాంతక వైరస్ పెంగ్విన్‌లు,ఇతర స్థానిక పక్షి జాతులకు ముప్పు కలిగిస్తుందనే ఆందోళనలను బ్రిటీష్ నిపుణులు లేవనెత్తారు....

Bird Flu Detected

Bird Flu : అంటార్కిటికా ప్రాంతంలో మొదటిసారిగా బర్డ్ ఫ్లూ వెలుగు చూసింది. ప్రాణాంతక వైరస్ పెంగ్విన్‌లు,ఇతర స్థానిక పక్షి జాతులకు ముప్పు కలిగిస్తుందనే ఆందోళనలను బ్రిటీష్ నిపుణులు లేవనెత్తారు. చరిత్రలో అత్యంత పాథోజెనిక్ ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా పక్షులకు కీలకమైన సంతానోత్పత్తి ప్రదేశం అయిన అంటార్కిటికాకు చేరుకుందని శాస్త్రవేత్తలు భయపడుతున్నారు.

Also Read : Jailer Actor arrest : జైలర్ మూవీ విలన్ వినాయకన్ అరెస్ట్…ఎందుకంటే…

దక్షిణ అమెరికా కొనకు తూర్పున, అంటార్కిటికా ప్రధాన భూభాగానికి ఉత్తరాన ఉన్న బ్రిటీష్ ఓవర్సీస్ భూభాగం, దక్షిణ జార్జియాలోని బర్డ్ ఐలాండ్‌లో మరణించిన సముద్ర పక్షుల నుంచి నమూనాలను తీసుకున్నారని బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే తెలిపింది. బ్రిటన్ దేశంలో చేసిన పరీక్షల్లో బర్డ్ ఫ్లూ పాజిటివ్ అని వచ్చిందని యూకే తెలిపింది.

వలస పక్షుల్లో వ్యాపించిన వైరస్

బర్డ్ ఫ్లూ కేసులు భారీ సంఖ్యలో ఉన్న దక్షిణ అమెరికాకు వలస వెళ్లిన పక్షుల ద్వారా ఈ వైరస్ ఎక్కువగా వ్యాపించిందని తెలిపింది. అంటార్కిటికా ప్రాంతంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందడం వినాశకరమైన వార్త అని మెల్‌బోర్న్ విశ్వవిద్యాలయానికి చెందిన బర్డ్ ఫ్లూ నిపుణుడు మిచెల్ విల్లే అన్నారు.

Also Read : Uttarakhand : నదిలోకి దూసుకెళ్లిన కారు…ఆరుగురి ఆదికైలాష్ యాత్రికుల మృతి

వలస పక్షులు దక్షిణ అమెరికా నుంచి అంటార్కిటికా దీవులకు ఆపై ప్రధాన భూభాగానికి వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని యూకే యానిమల్ అండ్ ప్లాంట్ హెల్త్ ఏజెన్సీ వైరాలజీ హెడ్ ఇయాన్ బ్రౌన్ గత వారం హెచ్చరించారు. మునుపెన్నడూ వైరస్‌కు గురికాని పెంగ్విన్‌ల వంటి పక్షులకు ఈ వైరస్ మరింత హాని చేసే అవకాశం ఉంది. ఈ నెల ప్రారంభంలో కంబోడియాలో బర్డ్ ఫ్లూతో రెండేళ్ల బాలిక మరణించింది.