Boy Dance Viral
Viral Video : చాలామంది ఇంజెక్షన్ చేయించుకోవడానికి భయపడతారు. అలాంటిది ఓ బాలుడికి గుండె, వెన్నెముకకు అతి పెద్ద సర్జరీ జరగబోతోంది. ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్లబోతూ ‘సెలబ్రేట్’ అంటూ ఉత్సాహంగా ఆ పిల్లవాడు చేసిన డ్యాన్స్ అందరినీ మనసుల్ని హత్తుకుంది.
Eluru District : నచ్చిన బట్టలు వేసుకోనివ్వలేదట.. సవతి తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలుడు
పీపుల్ మ్యాగజైన్ ఓ బాలుడి వీడియోను షేర్ చేసింది. హృదయాన్ని కదిలించే వీడియోలో, ఒక చిన్న పిల్లవాడు ఆపరేషన్‌కి వెళ్లేముందు ఎంతో హుషారుగా డ్యాన్స్ చేస్తున్నాడు. హాస్పిటల్ గౌను వేసుకుని కారిడార్‌లో పైకి కిందికి కదులుతూ రకరకాల మూమెంట్స్‌లో బాలుడు స్టెప్పులు వేశాడు. ఆసుపత్రి సిబ్బంది అతడిని ఉత్సాహ పరిచారు. people అనే ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేరైన ఈ వీడియోకి ‘ఒకవేళ మీకు ఈ రోజు చిరునవ్వు అవసరం’ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు.
Real Hero : తుపాను గాలికి తల్లి దుకాణం పడిపోకుండా కాపాడిన బాలుడు.. నిజంగా రియల్ హీరో
ఒక్కోసారి పరిస్థితిలో ఆందోళనకరంగా మారతాయి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నిరాశచెందకూడదని కొన్నిసార్లు పిల్లల నుంచి నేర్చుకోవచ్చు. వైరల్ అవుతున్న వీడియో బాలుడుని చూస్తే ఎవరిలో అయినా ఉత్సాహం వస్తుంది. ఈ వీడియో చూసిన వారంతా బాలుడి డ్యాన్స్‌ని మెచ్చుకోవడంతో పాటు .. అతను సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండాలని విష్ చేశారు.