Eluru District : నచ్చిన బట్టలు వేసుకోనివ్వలేదట.. సవతి తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలుడు

రెండేళ్ల క్రితం తల్లి చనిపోయింది. సవతి తల్లి పెట్టే ఇబ్బందులు ఆ బాలుడు భరించలేకపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలుడి ధైర్యానికి పోలీసులు అవాక్కయ్యారు. ఇంతకీ అతను చేసిన ఫిర్యాదు ఏంటంటే?

Eluru District : నచ్చిన బట్టలు వేసుకోనివ్వలేదట.. సవతి తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలుడు

Eluru District

Boy complaint against step mother : దినేష్ అనే కుర్రాడు సవతి తల్లిపై ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కి వచ్చాడు. అతని సమస్యను విన్న పోలీసులు అతని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ ఘటన ఏలూరు జిల్లా కొత్తపేటలో జరిగింది.

బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసిన సవతి తల్లి

దినేష్ అనే బాలుడి తల్లి రెండేళ్ల క్రితం చనిపోయింది. తండ్రి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి దినేష్‌కి సమస్యలు మొదలయ్యాయి. రీసెంట్‌గా దినేష్ స్నేహితుడి పుట్టినరోజు జరిగింది. ఆ వేడుకకు వెళ్లడానికి దినేష్ రెడీ అయ్యి సవతి తల్లిని తెల్లటి చొక్కా అడిగాడు. అందుకు ఆమె నిరాకరించడంతో పాటు వేడుకకు వెళ్లద్దని బెదిరించింది. అప్పటికే ఆమె పెట్టే ఇబ్బందులు దినేష్ భరించలేకపోయాడు. విసుగు చెందిన దినేష్ టవల్ పైనే ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లాడు. అక్కడి పోలీసులకు తన సవతి తల్లిపై ఫిర్యాదు చేశాడు.

మొదటి పెళ్లిని కప్పిపుచ్చటానికి ఆరేళ్ళ కూతుర్ని చంపిన కసాయి తల్లి

బాలుడి మాటలు విన్న పోలీసులు అవాక్కయ్యారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పి.చంద్రశేఖర్ వెంటనే బాలుడి తల్లిదండ్రులను పిలిపించి వారికి కౌన్సెలింగ్ఇచ్చారు. దినేష్ గతంలో కూడా తల్లి పెడుతున్న ఇబ్బందులను పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దినేష్ పట్ల ప్రవర్తన మార్చుకోవాల్సిందిగా పోలీసులు అతని సవతి తల్లిని హెచ్చరించారు. దినేష్‌కి కూడా తల్లిదండ్రులతో మాట్లాడేటపుడు మంచి ప్రవర్తన కలిగి ఉండాలని సూచించారు.