అమ్మ ప్రేమకు హాట్సాఫ్ : కడుపులో చనిపోయిన పసిగుడ్డు కోసం..

కడుపులో బిడ్డ ఒడిలో వస్తుందనే క్షణమొక యుగంలా గడుపుతూ ఓ తల్లి ఎదురు చూస్తోంది. ఎందుకంటే 40 ఏళ్ల పండిన కడుపు. కోటి కోరికలతో ఒళ్లంతా కళ్లు చేసుకుని బిడ్డను చూడాలని ఉవ్విళ్లూరుతోంది. భార్యను. బిడ్డను అరచేతిల్లో పెట్టుకుని చూసుకోవాలని భర్త కూడా ఎదురు చూస్తున్నాడు. పైళ్లై 40 సంవత్సరాలకు భార్య గర్భం ధరించింది. దీంతో ఆ ఆలూమగల ఆనందానికి ఆకాశమే హద్దు అయ్యింది. నెలలు నిండి పుట్టే బిడ్డ కోసం ఎంతో ఆతృతగా..ఆశగా..ఆకాంక్ష నిండిన కళ్లతో ఎదురు చూస్తున్నారు. కానీ వారు ఊహించని వార్త వినాల్సి వచ్చింది. కడుపులోని శిశువు 14వారాలకే చనిపోయింది. 14 వారాలు కాబట్టి శిశువుకి కాళ్లూ..చేతులు ఏర్పడ్డాయి. కానీ చిట్టి గుండె లోకం చూడకుండానే ఆగిపోయింది.డాక్టర్లు చెప్పిన ఆ మాట విని ఆ తల్లి గుండె ఆగిపోయినంత పనైంది.
బిడ్డ కడపులోని చనిపోయింది..ఆమెకు నొప్పులు రావు..కాబట్టి శిశువుని ముక్కలు చేసి బైటకు తీయాలని డాక్టర్లు చెప్పారు. గుండెలవిసేలా ఏడ్చింది. అందుకు ఆ తల్లి ఒప్పుకోలేదు. నా బిడ్డను ముక్కలు చేయటానికి ఒప్పుకోనంది. ఆ తల్లి పేరు షరన్.ఆమె భర్త పేరు మైకేల్..యూఎస్ లోని మిస్సోరివాసులు. కడుపులోని చనిపోయిన తన బిడ్డ ఎప్పుడూ తన కళ్లముందే ఉండాలని ఆశపడింది ఆ తల్లి. ముక్కలు చేయటానికి ఒప్పుకోలేదు. అందుకు ఆమె తీసుకున్న నిర్ణయానికి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. బిడ్డను ముక్కలు చేయకుండా బైటకు తీసి తనకివ్వాలని డాక్టర్లను కోరింది.
14 వారాల పసిగుడ్డు ఎంత ఉంటుంది..4 అంగుళాలు ఉంటుంది. 26 గ్రాముల బరువు. అంతే. ఆమె కోరినట్లుగానే సర్జరీ చేసి చనిపోయిన శిశువుని తీసి షరన్ చేతిలో పెట్టారు. ఆ పిండాన్ని పాతిపెట్టడానికి భార్యాభర్తలిద్దరినీ మనసొప్పలేదు. ఆ బేబీని జీవితాంతం జ్ఞాపకంగా ఉంచుకోవాలనుకున్నారు. దీంతో ఓ వారం పాటు ఫ్రీజర్ లో దాచిపెట్టారు. తరువాత ఏం చేయాలని ఆలోచించారు.
తరువాత హైడ్రేంజియా అనే ఓ పూల మొక్కను తీసుకొచ్చి కుండీలో నాటారు. కుండీలో మొక్కను నాటిన తరువాత తమ బేబీని పూడ్చిపెట్టారు. అప్పటి నుంచి ఆ మొక్కనే తమ బేబీగా చూసుకుంటున్నారు. హృదయ వికారమైన వీరి కథ వింటే ఎవరికైనా గుండెలు బరువెక్కాల్సిందే.
బేబీని పూడ్చక ముందు ఆ పసిగుడ్డును ఆసాంతం ఒళ్లంతా తడిమి తడిమి చూసుకున్నారు. బేబీ చేతులు, కాళ్లను నిమురుతూ ఫోటోలు తీయించుకున్నారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎంతో అపురూపంగా చూసుకుంటూ తమ జీవితాన్ని గడిపేస్తోంది ఆ జంట.రోజురోజుకూ పెరిగి పెద్దవుతున్న ఆ మొక్కలో తన బిడ్డను చూసుకుంటోంది ఆ తల్లి. ఆ తల్లి మొహంలోని ఆనందాన్ని అనిర్వచనీయమైన భావాలను చూసుకుంటు బిడ్డ చనిపోతే తన సహచరి ఏమైపోతుందోనని భయాందోళనకు గురైన మైకేల్ భార్యను..మొక్కగా ఎదుగుతున్న తన బిడ్డను చూసుకుంటున్నాడు.
తమ బిడ్డను కోల్పోయి సంవత్సం కాబోతున్నా..ఆ మొక్కనే బిడ్డకు భావిస్తున్నారు. తమ ఆనందాన్ని ఆ మొక్కతోనే పంచుకుంటున్నారు. మొక్క పెరుగుతుంటే ఈ సరికి మన బిడ్డ పాకుతూ ఉండేది..నడుస్తుండేది..అంటూ ఆ జ్నాపకాలలోనే జీవిస్తున్నారు..ఆ తల్లిదండ్రులు.