Breast Cancer Vaccine: రొమ్ము క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ ..మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ షురూ..

రొమ్ము క్యాన్సర్ నివారణకు వ్యాక్సిన్ తయారు చేసారు యూఎస్ శాస్త్రవేత్తలు, దీనికి సంబంధించి మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ కూడా ప్రారంభించారు.

breast cancer vaccine clinical trails started: ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 12 శాతం కొత్త రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని WHO గత ఫిబ్రవరి నెలలో ప్రకటించింది. అంటే రొమ్ము క్యాన్సర్ తీవ్రత ఎంతగా ఉందో ఊహించుకోవచ్చు. మహిళలకు ప్రాణాంతకంగా మారిన ఈ రొమ్ముక్యాన్సర్ ని పూర్తిగా నివారించే మెడిసిన్ అంటూ ప్రత్యేకంగా లేదు. కానీ ఇకనుంచి అటువంటి ఆందోళన అవసరం లేదంటున్నారు యూఎస్ శాస్త్రవేత్తలు . బ్రెస్ట్ క్యాన్సర్ (రొమ్ము క్యాన్సర్ )పై శాస్త్రవేత్తలు పోరాటాన్ని తీవ్రతరం చేశారు. తీవ్ర పరిశోధనలు ఫలితాలు సాధించాయనే ఆశాభావం వ్యక్తం అవుతోంది. ఎందుకంటే రొమ్ము క్యాన్సర్ నివారణ కోసం శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ రూపొందించారు. రొమ్ము క్యాన్సర్ ను నివారించే టీకాను కనిపెట్టారు యూఎస్ శాస్త్రవేత్తలు.

Read more : ‘Cordyceps sinensis’ : హిమాలయాల్లో పెరిగే ఈ ఫంగస్‌తో క్యాన్సర్‌కు మెడిసిన్ : ఆక్స్‌ఫర్డ్ పరిశోధకుల వెల్లడి

ఈ వ్యాక్సిన్ క్లినిక్ ట్రయల్స్ కూడా ప్రారంభించారు. అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ తన వ్యాక్సిన్ మొదటి దశ ట్రయల్‌ను ప్రారంభించింది. క్లినిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లోని స్టాఫ్ ఇమ్యునాలజిస్ట్ విన్సెంట్ తుయోహి ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. ప్రారంభమైన ఈ ట్రయల్ సహాయంతో, ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్, అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్‌ను నియంత్రించవచ్చు. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుండి వ్యాక్సిన్ ట్రయల్ కోసం ఆమోదం పొందిన తర్వాత క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ వ్యాక్సిన్ కంపెనీ అనిక్సా బయోసైన్స్‌తో కలిసి పని చేస్తోంది. ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ చాలా ముఖ్యమైనవిగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎందుకో తెలుసుకుందాం. ఈ వ్యాక్సిన తయారీకి గత రెండు దశబ్దాలు (20ఏళ్లు)గా పరిశోధనలు చేస్తున్నామని గత మంగళవారం (అక్టోబర్ 26,2021) మీడియాకు తెలిపారు విన్సెంట్ తుయోహి.

Read more : Telangana cancer cases : తెలంగాణలో 30 ఏళ్లలో 50 శాతం పెరిగిన క్యాన్సర్ కేసులు..

ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ మరణాల రేటు ఎక్కువగా ఉంది మరియు చికిత్స తర్వాత తిరిగి వచ్చే అవకాశం ఉందని..ఈ ట్రయల్స్ విజయవంతం అయితే క్యాన్సర్ ని పూర్తిగా నిరోధించవచ్చని ఈ పరిశోధన బృంధంలో మరో శాస్త్రవేత్త డాక్టర్ జి. థామస్ బడ్ తెలిపారు.”ప్రతిరోజూ, ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న కొంతమంది మహిళలను పరిశీలిస్తున్నామని..ప్రస్తుతం వారికి తగిన అధునాతన చికిత్సలు ఏమీ లేవని మహిళలు ఆ స్థితికి చేరుకోకుండా వారికి వ్యాక్సిన్ అందించటమే లక్ష్యంగా ఈ వ్యాక్సిన్ పరిశోధనలు జరుగుతున్నాయని క్యాన్సర్ ను నిరోధించటం..దానిని అంతం చేయటమే ఈ పరిశోధనల లక్ష్యమని తెలిపారు.

కొత్త వ్యాక్సిన్‌కు రొమ్ము క్యాన్సర్‌ను నివారించే సామర్థ్యం ఉందని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ లెర్నర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లోని ఇమ్యునాలజిస్ట్, వ్యాక్సిన్ డెవలపర్ విన్సెంట్ తుయోఫీ చెప్పారు. రొమ్ము క్యాన్సర్ నిర్ధారించిన ప్రతి 100 కేసుల్లో 12 నుండి 15 మంది ట్రిపుల్-నెగటివ్ రొమ్ము క్యాన్సర్ రోగులు. ఇది రొమ్ము క్యాన్సర్‌లో అత్యంత తీవ్రమైన రకం. ఆఫ్రికన్, అమెరికన్ మహిళల్లో ఇటువంటి కేసులు ఎక్కువగా కనిపిస్తాయి. దీన్ని నియంత్రించాల్సిన అవసరం చాలా ఉందని తెలిపారు.ఈ ట్రయల్స్ కంటే ముందు..ఈ వ్యాక్సిన్ ఈ క్యాన్సర్‌తో బాధపడుతున్న 18 నుండి 24 సంవత్సరాల వయస్సు గల రోగులకు ఇచ్చారు. ఈ రోగులలో కణితులు పూర్తిగా కరిగిపోయినట్టు తేలింది. ప్రస్తుతం వారిలో మళ్లీ ట్యూమర్ వచ్చే ప్రమాదాన్ని అర్థం చేసుకోవటానికి వారిని నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు.

Read more : Inspiration Man Jayant Kandoi : ఆరుసార్లు క్యాన్సర్ ను జయించిన 23 ఏళ్ల యువకుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..

ట్రయల్ మొదటి దశలో, ఈ వ్యాక్సిన్ ట్రిపుల్-నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ప్రారంభ రోగులకు ఇస్తారు. క్యాన్సర్‌తో పోరాడాలంటే వారి శరీరంలో రోగ నిరోధక శక్తి ఎంతగా కనిపిస్తుందో దీనిద్వారా అర్థమవుతుంది. మొదటి దశ ట్రయల్‌లో పాల్గొన్న రోగులకు మూడు డోసుల వ్యాక్సిన్‌ను ఇస్తారు. టీకా ప్రభావం, దుష్ప్రభావాలను 2 వారాల పాటు పర్యవేక్షిస్తారు. ఈ ట్రయల్స్ మొత్తం సెప్టెంబర్ 2022 నాటికి పూర్తికానున్నాయి.

ఎలుకలపై ఫ్రీ క్లినికల్ ట్రయల్..
వ్యాక్సిన్‌కి సంబంధించిన ప్రీ-క్లినికల్ ట్రయల్ ఎలుకలపై చేసారు శాస్త్రవేత్తలు. ఈ వ్యాక్సిన్ రోగనిరోధక వ్యవస్థను సక్రియం చేసి బ్రెస్ట్ క్యాన్సర్ ట్యూమర్‌లను నివారించడంలో విజయవంతమైందని వారి విచారణలో వెల్లడైంది. నేచర్ మెడిసిన్స్ జర్నల్‌లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం..ఈ టీకా క్యాన్సర్ కణితులపైనే కాకుండా ఇతర కణితులపై ప్రభావవంతంగా ఉంటుందని సమాచారం. మొదటి మానవ పరీక్ష విజయవంతమైతే, ఈ టీకా పెద్ద మార్పును కలిగిస్తుందనే ఆశాభావాలు వ్యక్తం అవుతున్నాయి. ఇవి విజయవంతంగా కావాలని క్యాన్సర్ మహమ్మారిని అంతం చేయాలని కోరుకుందాం.

ట్రెండింగ్ వార్తలు