bride wedding veil got world record : పెళ్లి డ్రెస్ తో వధువు గిన్నీస్ రికార్డు

bride wedding veil got world record : ఈరోజుల్లో పెళ్లిని ఓ సంప్రదాయంగానే కాదు వెరైటీగా జరుపుకోవటానికి వధూ వరులు ఎంతగానో ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ముఖ్యంగా వెడ్డింగ్ షూట్ లు వినూత్నంగా జరుపుకుంటున్నారు. ఒకరిని మించి మరొకరు తమ వెడ్డింగ్ షూట్ వెరైటీగా ఉండాలనుకుంటున్నారు. ఈక్రమంలో ఓ వధువు పెళ్లికి ధరించే ఓ వస్త్రంతో ఏకంగా ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది.

ఆమె ధరించిన వెడ్డింగ్ వీల్ (పాశ్చాత్య సాంప్రదాయంలో తలపై ముసుగులా ధరించే వస్త్రం) పొడవు ఎంతగా భారీగా ఉందంటే..6962.6 మీటర్ల పొడవు ఉంది. అంటే ఒకటీ రెండూ కాదు ఏఖంగా 63 ఫుట్‌బాల్ స్టేడియాల పొడవుతో సమానం అన్నమాట. మరి అంత పొడువున్న ఆ వస్త్రాన్ని ఆమె ఎలా మోస్తోందీ? అనే కదా మీ డౌటు? గుర్తింపు తెచ్చుకోవాలనే తపన ఉంటే మోయటానికేంటీ ఇబ్బందీ చెప్పండీ..

సైప్రస్‌కు చెందిన మరియా పరస్కేవా తన వెడ్డింగ్ డ్రెస్ తో ఏకంగా ప్రపంచ రికార్డు క్రియేట్ చేసింది. తన పెళ్లి కోసం డ్రెస్ ను వెరైటీగా డిజైన్ చేయించుకుంది. వివాహ సమయంలో ఆమె ధరించిన వీల్ (పాశ్చాత్య సాంప్రదాయంలో తలపై ధరించే వస్త్రం) పొడవు ఏకంగా 6962.6 మీటర్ల పొడవంత ఉందీ వీల్. 6962.6 మీటర్ల పొడవంటే 63 ఫుట్‌బాల్ స్టేడియాల పొడవుతో సమానం.

వివాహం జరిగిన స్టేడియం మొత్తాన్ని ఆ వీల్ కప్పేసిందీ అంటే దాని పొడవును ఊహించుకోండీ. ఆ వస్త్రాన్ని మైదానంలో అమర్చడానికి 30 మంది వలంటీర్లు 6 గంటల పాటు కష్టపడ్డారు. దీంతో గిన్నీస్ వరల్డ్ రికార్డు ఆమె సొంతమైంది. గిన్నీస్ వరల్డ్ రికార్డు సంస్థ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో వైరల్‌గా మారింది. మరి మీరు కూడా ఈ వెడ్డింగ్ వీల్ పై ఓ లుక్ వేయండీ..అబ్బో మామూలుగా లేదుగా అని తప్పకుండా అంటారు..

 

 

ట్రెండింగ్ వార్తలు