కరోనా కరాళ నృత్యం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం కూడా లాక్‌డౌన్ విధించి ఇప్పుడు కాస్త గ్యాప్ తర్వాత ఇప్పుడు సడలింపులు ఇస్తున్నాయి. అయితే ప్రాణాంతక కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ప్రస్తుతం ఆ దేశంలో ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. అందులో భాగంగా ఇంగ్లండ్‌లోని పబ్‌లను, బార్లను, రెస్టారెంట్లను రాత్రి పది గంటల వరకు మూసివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఏ పబ్‌లోనూ.. బార్‌లోనూ ఒకే చోట ఎనిమిది మందికి మించి ఉండరాదని కూడా నిర్ణయం తీసుకుంది. అంతేకాదు మాస్కులు లేకుండా ఉండేందుకు వీళ్లేదని, పబ్‌లు, బార్లకు వచ్చే ప్రతి వ్యక్తి నుంచి ఫోన్ నెంబర్, అడ్రెస్ తీసుకోవాలంటూ కఠినమైన నిబంధన అమల్లోకి తెచ్చింది.
అయితే కొంత మంది ఎంపీల విజ్ఞప్తి మేరకు ఈ ఆంక్షల నుంచి ఇంగ్లండ్ పార్లమెంట్‌లోని బార్లను ‘వర్కింగ్ ప్లేస్ క్యాంటీన్’ కేటగిరీ కింద మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ ఆవరణలో మొత్తం 30 బార్లు ఉండగా.. వీటిలో గెస్ట్‌లను అనుమతించే బార్లు కూడా ఉన్నాయి. జర్నలిస్టులను అనుమతించే బార్లు కొన్ని ఉన్నాయి. కొన్ని బార్లలో ఎంపీలకు మాత్రమే అనుమతి ఉంటుంది.
ది లార్డ్స్ బార్, ది బిషప్స్ బార్, దీ పీర్స్ డైనింగ్ రూమ్, ది పీర్స్ గెస్ట్ రూమ్, ది పూజిన్ రూమ్, ది టెర్రేస్ పెవీలియన్, ది స్ట్రేంజర్స్ బార్, ది టెర్రేస్ కాఫెటేరియా, ది థేమ్స్ పెవీలియన్, ది స్పీకర్స్ స్టేట్ రూమ్స్, ది రివర్ రెస్టారెంట్, బెల్లమీస్, ది డిబేట్, ది జూబ్లీ రూమ్, ది అడ్జెర్న్‌మెంట్, ది మెంబర్స్ డైనింగ్ రూమ్, ది స్ట్రేంజర్స్ డైనింగ్ రూమ్, ది స్పోర్ట్స్ అండ్ సోషల్ బార్, ది ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ రూమ్, ది చర్చిల్ రూమ్, ది కోల్‌మాండ్‌లే రూమ్, ది బెర్రీ రూమ్, ది హోం రూమ్, జూబ్లీ కేఫ్, ది అట్లీ రూమ్, మిల్‌బ్యాంక్ హౌజ్ కేఫ్‌టేరియా, ది రివర్ డైనింగ్ రూమ్స్, మాన్‌క్రీఫ్స్‌లలో బార్లు ఉన్నాయి. వీటిలో మాన్‌క్రీఫ్స్ జర్నలిస్టులకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. ఇవి ఎప్పటిలాగే రాత్రి ఒంటి గంట వరకు పనిచేస్తాయి.
వీటిలో మూడు డాలర్లకు ఒక్క బీరు చొప్పున సబ్సిడీపై అందజేస్తుంటారు. ఫలితంగా ఏటా 8 మిలియన్ డాలర్ల సబ్సిడీ భారం పన్ను చెల్లింపుదారులపై పడుతోంది. ఇప్పుడు అక్కడ ఆంక్షలు కారణంగా ఎక్కువగా బీర్లు పార్లమెంట్‌లో పొంగుతున్నాయట. ఈ విషయాన్ని అక్కడి వార్తాపత్రికలు రాసుకొచ్చాయి.