బ్రెగ్జిట్ ఓటింగ్ లో పాల్గొనేందుకు.. ఎంపీ డెలివరీ డేట్ వాయిదా

  • Publish Date - January 15, 2019 / 06:06 AM IST

 యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగనున్న సమయంలో మంగళవారం(జనవరి15,2019) బ్రెగ్జిట్ ఓటింగ్ లో పాల్గొనేందుకు బ్రిటన్ ప్రతిపక్ష లేబర్ పార్టీకి చెందిన ఎంపీ తన డెలివరీ డేట్ ను వాయిదా వేసుకొన్నారు.  ఎంపీ తులిప్ సిద్దిఖ్(36)కి వాస్తవానికి ఈ రోజు సిజేరియన్ ఆపరేషన్ జరగాల్సి ఉంది. అయితే బ్రెగ్జిట్ ఓటింగ్ లో పాల్గొనేందుకు ఆమె తన డెలివరీ డేట్ ను వాయిదా వేసుకొంది. డాకర్టు కూడా గురువారం వరకు ఆపరేషన్ వాయిదాకు అంగీకరించారు.

పార్లమెంట్ కు వీల్ చైర్ లో వచ్చి ఓటింగ్ లో పాల్గొనేందుకు ఆమె ఆలోచిస్తోంది. ఈ సందర్భంగా ఎంపీ తులిప్ మాట్లాడుతూ… డాక్టర్లు సూచించిన దానికంటే ఒకరోజు తర్వాత నా కొడుకు ఈ ప్రపంచంలోకి ప్రవేశిస్తే… యూరప్, బ్రిటన్ ల మధ్య బలమైన సంబంధాలను ఈ ప్రపంచం కలిగి ఉండే అవకాశముందని, ఆ విలువ కోసం తాను ఫైట్ చేస్తున్నానని ఆమె తెలిపారు. తన ఒక్క ఓటు బ్రెగ్జిట్ ఫలితాంశంపై ప్రభావం చూపకుండా ఉండేందుకు  ఓటింగ్ లో పాల్గొంటున్నట్లు ఆమె తెలిపారు.