మాస్క్ పెట్టుకోనన్నాడు.. అమెరికన్ స్టార్ బ్రూస్ విల్లీస్‌ను స్టోర్ నుంచి గెంటేశారు!

Bruce Willis leave store not wear a mask : అమెరికన్ డై హార్ట్ స్టార్ బ్రూస్ విల్లీస్ కు చేదు అనుభవం ఎదురైంది. మాస్క్ ధరించకుండా ఓ స్టోర్ లోకి వెళ్లినందుకు ఆయన్ను బయటకు పంపించేశారు. ఈ ఘటన లాస్ ఏంజిలెస్ రైట్ ఎయిడ్ స్టోర్ లో జరిగింది. 65ఏళ్ల బ్రూస్ ముఖానికి మాస్క్ ధరించకుండా అలానే స్టోర్ లోకి ప్రవేశించాడు. అక్కడి వారంతా ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా మాస్క్ లేకుండా బ్రూస్‌కు తిరుగుతున్నాడు.
స్టోర్‌లోకి వెళ్లిన బ్రూసును అక్కడి సిబ్బంది మాస్క్ ధరించమని కోరినప్పటికీ ఆయన నిరాకరించారు. తన మెడకు స్క్రాప్ మాదిరి మాస్క్ కూడా ఉంది. అయినా బ్రూస్ ధరించేందుకు అంగీకరించలేదు. దాంతో స్టోర్ సిబ్బంది బయటకు వెళ్లాల్సిందిగా కోరారు.
లేదంటే ఇతరులకు ఇబ్బందిగా ఉందని చెప్పారు. దాంతో బ్రూస్ స్టోర్ లో ఏమి కొనకుండానే వెనక్కి వెళ్లిపోయారు. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ కౌంటీ కరోనావైరస్ వ్యాప్తికి కేంద్రంగా మారింది. ఇప్పటికే 10వేల కరోనా మరణాలు నమోదయ్యాయి.