Dave Asprey tries to live more 180 years : మనిషి ఆయుష్సు 100ఏళ్లు. అందుకే..నిండు నూరేళ్లు సంతోషంగా..ఆయురారోగ్యాలతో జీవించాలని పెద్దలు దీవిస్తుంటారు. కానీ..అంతులేని కాలుష్యాలతో..కల్తీ ఆహారాలతో..బిజీ బిజీ జీవితంలో పడే టెన్షన్లతో మనిషి ఆయుషు తగ్గిపోతోంది. కానీ నిండు నూరేళ్లే కాదు 180 ఏళ్లు బతకాలని… ఓ వ్యాపారవేత్త ఆశపడుతున్నాడు. అదికూడా నిత్య యవ్వనంతో జీవించాలని జీవితాన్ని మనసారా ఆస్వాదించాలని ఆకాంక్షిస్తున్న ఓ వ్యాపారవేత్త వినూత్న ప్రయోగాలు చేస్తున్నాడు. తన శరీరంపై ఆ ప్రయోగాలను చేసుకుంటున్నాడు. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి బోన్ మ్యారో చేయించుకుంటున్నాడు. దీంతో 180 ఏళ్లు కాకపోయినా కనీసం 133 ఏళ్లు బతుకుతానని నమ్ముతున్నాడు..బుల్లెట్ ప్రూఫ్ కాఫీ బ్రాండ్ వ్యవస్థాపకుడు డేవ్ ఆస్ప్రే ..!!
మానవుడి సగటు ఆయుర్దాయం విషయం పక్కన పెడితే..వీలైనంత ఎక్కువ కాలం బతకాలని ప్రతీ మనిషి ఆశపడతాడు. కానీ అమెరికాకు చెందిన బుల్లెట్ ప్రూఫ్ కాఫీ బ్రాండ్ వ్యవస్థాపకుడు డేవ్ ఆస్ప్రే మాత్రం ఏకంగా 180 ఏళ్లు జీవించాలని కోరుకుంటున్నారు. అది కూడా నిత్య యవ్వనంగా జీవించాలని ఆకాంక్షిస్తున్నారు.
అక్టోబర్ 30, 1973లో పుట్టిన ఆస్ప్రే వయసు ప్రస్తుతం 47 సంవత్సరాలు. ఆస్ర్పేకు జీవితాన్ని ఆస్వాదించటం అంటే..చాలా చాలా ఇష్టం. ఎప్పుడూ మంచి ఫిట్ నెస్ తో ఉంటారు. తన ఆయుషు పెరగాలని కోరుకుంటున్నారు.
జీవశాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అండతో వందేళ్లకు పైగా బతకాలని తహతహలాడుతున్నారు. అనుకోవటమే కాదు దాని కోసం ఆరు నెలలకు ఓసారి బోన్ మ్యారో (ఎముక మజ్జ)లో కొంత భాగాన్ని తొలగించి..దాని నుంచి సేకరించిన స్టెమ్ సెల్స్ (మూల కణాలు)ను దేహం మొత్తానికి ఎక్కించుకుంటున్నారు. తద్వారా తను ఇంకా 133 ఏళ్ల వరకు బతుకుతానని ఆస్ప్రే నమ్ముతున్నారు.
కాగా..ఈ ప్రక్రియ చేయించుకోవాలంటే తరచుగా కోల్డ్ క్రియోథెరపీ అవసరమవుతుంది.కోల్డ్ క్రియోథెరపీ అంటే..అత్యంత శీతల వాతావరణం (Extremely cold weather)ఉండే కోల్డ్ చాంబర్ లో కూర్చోవాలి. ద్రవరూప నైట్రోజన్ శరీరాన్ని బాగా కూల్ చేస్తుంది. ఆ సమయంలో తలకు ఎలక్ట్రోడ్ లు అమర్చుకుని ఇన్ ఫ్రారెడ్ కాంతి కిరణాల కింద ఉండాలి. ఇలా తరచుగా చేయడం వల్ల శరీరం నిత్య యవ్వనంగా ఉంటుందని ఆస్ప్రే నమ్ముతున్నారు. అదే విషయాన్ని చెబుతున్నారు.
ఈ వినూత్న వైద్య ప్రక్రియల కోసం డేవ్ ఆస్ప్రే ఇప్పటివరకు రూ.13 కోట్లకుపైనే ఖర్చు చేశారట. బుల్లెట్ ప్రూఫ్ కాఫీ బ్రాండ్ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న డేవ్ఆస్ర్పే తాను సాధించింది కొంతే..ఇంకా సాధించాల్సింది చాలా ఉందని..అందుకే సాధ్యమైనంత ఎక్కువ కాలం బతకాలనుకుంటున్నానని ఆస్ప్రే చెబుతున్నారు.