Judge Shoots Wife : రెస్టారెంట్‌లో చిన్న గొడవ .. భార్యను కాల్చి చంపేసిన న్యాయమూర్తి

భార్యా భర్తల మధ్య చోటుచేసుకున్న చిన్నపాటి గొడవ కాస్తా కాల్చి చంపేవరకు వెళ్లింది. భోజనం చేస్తుండగా ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి భార్యకు తుపాకితో కాల్చి చంపేశాడు న్యాయమూర్తి.

USA Judge Shoots Wife

USA Judge Shoots Wife : అమెరికా (USA)లో భార్యా భర్తల మధ్య చోటుచేసుకున్న చిన్నపాటి గొడవ కాస్తా కాల్చి చంపేవరకు వెళ్లింది. కాలిఫోర్నియా(California)లోని ఆరెంజ్ కౌంటీ సుపీరియర్ కోర్టు(Orange County Superior Court)లో న్యాయమూర్తిగా ఉన్న జెఫ్రీ ఫెర్గ్యుసన్ (Judge Jeffrey Ferguson)తన భార్యతో కలిసి బయటకు వెళ్లారు. ఓ రెస్టారెంట్ కు వెళ్లిన క్రమంలో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఆ గొడవ కాస్తా పెద్దదైంది. ఇద్దరు కలిసి ఇంటికి వచ్చేసినా గొడవ ఏమాత్రం తగ్గలేదు. పైగా తాగి ఉన్న మద్యం మైకంలో న్యాయమూర్తి విచక్షణ మర్చిపోయి భార్యను తుపాకితో కాల్చి చంపేశారు.

న్యాయూమర్తి జెఫ్రీ ఫెర్గ్యుసన్ (75) ఆగస్టు 3(2023)న తన భార్య షెరిల్ ఫెర్గూసన్ (Sheryl Ferguson) తో కలిసి అనహైమ్ ప్రాంతంలోని ఓ ఖరీదైన రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ డిన్నర్ చేస్తుండగా భార్యాభర్తల మధ్య చిన్నగా మాటా మాటా పెరిగింది. అదికాస్తా పెద్దదైంది. దీంతో తన చేతినే తుపాకీలా పోజు పెట్టి కాల్చిపారేస్తా జాగ్రత్త అంటూ భార్యకు వార్నింగ్ ఇచ్చారు జెఫ్రీ. దానికి ఆమె కూడా ఏమాత్రం తగ్గకుండా వేలుతో పోజు కొట్టటం కాదు నిజమైన గన్ పెట్టు చూద్దాం అంటూ రెచ్చగొట్టింది. దీంతో ఇంకా రెచ్చిపోయారు జెఫ్రీ. అలా ఇద్దరు గొడవ పడుతునే ఇంటికి చేరుకున్నారు.

Eiffel Tower : మద్యం మత్తులో రాత్రంతా ఈఫిల్ టవర్ పైనే.. అనుమతి లేని ఎత్తైన ప్రదేశానికి వెళ్లిన ఇద్దరు పర్యాటకులు అరెస్టు

జెఫ్రీ ఇంటికొచ్చా కూడా భార్యను తిడుతునే ఉన్నాడు. మద్యం మత్తు దిగకపోవటంతో ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతు  నిన్ను కాల్చిపారేస్తా కాల్చి పారేస్తా అంటూ పదే పదే అనటంతో షెరిల్ కు చిర్రెత్తుకొచ్చింది. ‘‘ఏంటి ఉత్తగానే కాల్చేస్తా కాల్చేస్తా అంటున్నావు..నిజమైన గన్నును నాపై గురిపెట్టు’’ అని సవాలుచేసింది. అంతే అతని అహం దెబ్బతింది. పైగా మద్యం మైకం. ఏమాత్రం ఆలోచించలేదు. మద్యం మత్తు విచక్షణ మర్చిపోయేలా చేసింది. అంతే ఇంట్లో ఉన్న తుపాకీ తీసి కాల్చేసారు. అంతే షరిల్ అక్కడిక్కడే కుప్పకూలి చనిపోయింది.

అంతా నిమిషాల్లోనే జరిగిపోయింది. మరి మద్యం మత్తు దిగిందో ఏమోగాని కాసేపటికి తేరుకున్న జెఫ్రీ పోలీసులకు ఫోన్ చేసి తాను భార్యను తుపాకీతో కాల్చిచంపేశానని చెప్పారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు న్యాయమూర్తి షరిల్ ను పరిశీలించగా తుపాకీ గుళ్లు చాతీలోకి దూసుకుపోయి మరణించినట్లుగా గుర్తించారు. ఇంట్లో 47 గన్నులు, భారీగా బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈలోగా పోలీసులు వచ్చే లోపు ఫెర్రీ కోర్టు క్లర్క్ కు ఫోన్ చేసి ‘‘నేను అనుకోకుండా కంట్రోల్ తప్పాను..నా భార్యను తుపాకీతో కాల్చాను..ఆమె చనిపోయింది. రేపు నేను కోర్టుకు రాలేను.. పోలీసుల అదుపులో ఉంటా. నన్ను క్షమించండి’’ అని మెసేజ్ చేశారు.

Rishi Sunak : కేంబ్రిడ్జ్‌లో రామ్ కథకు హాజరైన బ్రిటీష్ ప్రధాని రిషి సునక్

ఫెర్రీని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. గత మంగళవారం విచారణ జరిగింది. ఈ ఘటన మద్యం మత్తులో జరిగిందా..? లేదా ఆవేశంతో జరిగిందా..? అనేది తెలియాల్సి ఉంది అంటూ పేర్కొన్నా న్యాయమూర్తి ఆయనకు బెయిల్ మంజూరు చేశారు.అక్టోబర్ 30న ఆయన విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.

 

ట్రెండింగ్ వార్తలు