Plastic Electric Conductor : విద్యుత్తు వాహకంలా పనిచేసే ప్లాస్టిక్‌!

సరికొత్త విద్యుత్తు వాహక పదార్థాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడు ప్లాస్టిక్‌ కూడా విద్యుత్తు వాహకంలా పనిచేస్తుంది. ఐఫోన్‌, సోలార్‌ ప్యానెల్‌, టీవీ.. ఏ ఎలక్ట్రానిక్‌ పరికరం తయారీకైనా వాహక పదార్థాలు చాలా అవసరం. కొన్నేళ్ల వరకూ వెండి, బంగారం, రాగి, ఇనుము తదితరాలను వాహకాలుగా ఉపయోగించారు.

plastic electric conductor

Plastic Electric Conductor : సరికొత్త విద్యుత్తు వాహక పదార్థాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడు ప్లాస్టిక్‌ కూడా విద్యుత్తు వాహకంలా పనిచేస్తుంది. ఐఫోన్‌, సోలార్‌ ప్యానెల్‌, టీవీ.. ఏ ఎలక్ట్రానిక్‌ పరికరం తయారీకైనా వాహక పదార్థాలు చాలా అవసరం. కొన్నేళ్ల వరకూ వెండి, బంగారం, రాగి, ఇనుము తదితరాలను వాహకాలుగా ఉపయోగించారు.

50 ఏళ్ల క్రితం డోపింగ్‌ ప్రక్రియ ద్వారా సెమీ కండక్టర్స్‌ను తయారు చేశారు. అయితే తేమ, అధిక ఉష్ణోగ్రతకు గురైతే ఇవి వాహక తత్వాన్ని కోల్పోతాయి. కాగా, చికాగో పరిశోధకులు ఏ పరిస్థితుల్లోనైనా స్థిరంగా ఉండే సరికొత్త విద్యుత్తు వాహక పదార్థాన్ని ఆవిష్కరించారు.

Solar Night power : రాత్రిళ్లు సోలార్ పవర్ ఉత్పత్తి చేయటానికి కొత్త టెక్నాలజీ తయారు చేసిన ఆస్ట్రేలియా పరిశోధకులు

నికెల్‌ అణువులను కార్బన్‌, సల్ఫర్‌తో తయారు చేసిన మాలిక్యులర్‌ పూల స్ట్రింగ్‌లో అమర్చారు. అది ఆశ్చర్యకరంగా వాహకంలా పని చేసింది. ఇది పరమాణు నిర్మాణ పరంగా ప్లాస్టిక్‌లాగా ఉన్నా.. విద్యుత్‌ వాహకంలా పని చేసింది.