Solar Night power : రాత్రిళ్లు సోలార్ పవర్ ఉత్పత్తి చేయటానికి కొత్త టెక్నాలజీ తయారు చేసిన ఆస్ట్రేలియా పరిశోధకులు
ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు.. థర్మో రేడియేటివ్ డయోడ్ అనే సెమీ కండక్టర్ పరికరాన్ని తయారుచేశారు. దాని ద్వారా.. రాత్రిళ్లు కూడా సోలార్ ప్యానెల్స్ ద్వారా పవర్ జనరేట్ చేయొచ్చు. ఇది గనక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే..

Solar Night power : సోలార్ పవర్.. ఎంతో శక్తిమంతమైంది. దాని ద్వారా.. ఎంత పవర్ అయినా.. ఫ్రీగా జనరేట్ చేయొచ్చు. కానీ.. దానికో లిమిట్ ఉంది. రాత్రి పూట సోలార్ ప్యానెల్స్ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయలేం. కానీ.. దీనిని కూడా అధిగమించే టెక్నాలజీ వచ్చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన కొందరు పరిశోధకులు.. థర్మో రేడియేటివ్ డయోడ్ అనే సెమీ కండక్టర్ పరికరాన్ని తయారుచేశారు. దాని ద్వారా.. రాత్రిళ్లు కూడా సోలార్ ప్యానెల్స్ ద్వారా పవర్ జనరేట్ చేయొచ్చు. ఇది గనక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. సీన్ పూర్తిగా మారిపోతుంది.
సోలార్ పవర్ ఎనర్జీలో.. ఇదొక గేమ్ ఛేంజర్ అని చెప్పొచ్చు. ఇప్పటివరకు.. సోలార్ పవర్ జనరేషన్‌కు.. సూర్య కిరణాలు మాత్రమే అవసరమయ్యాయ్. అందువల్ల.. రాత్రి వేళల్లో.. సోలార్ పవర్ ఉత్పత్తి జరగట్లేదు. మరి.. ఆస్ట్రేలియా పరిశోధకులు దీనినెలా సాధించారు? ఏ టెక్నాలజీతో.. రాత్రివేళ సోలార్ పవర్ జనరేట్ చేయొచ్చని చెబుతున్నారు? ఇది.. ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి వస్తే.. భూమిపై కాలుష్యం తగ్గిపోతుందా?
సంప్రదాయ పద్ధతుల్లో కరెంటును ఉత్పత్తి చేస్తే.. భూమిపై కాలుష్యం పెరిగిపోతుంది. అదే సోలార్, విండ్ పవర్ ద్వారా అయితే.. చాలా వరకు పొల్యూషన్ తగ్గించొచ్చు. ఐతే.. ఏ దేశంలోనైనా.. సూర్యరశ్మి రోజుకు 12 గంటలే ఉంటుంది. తర్వాత చీకటి కమ్మేస్తుంది. అందువల్ల సూర్యుడు ఉన్నప్పుడు మాత్రమే.. సోలార్ పవర్‌ని ఉత్పత్తి చేయడం సాధ్యమైంది ఇప్పటివరకు. కానీ.. లేటెస్ట్‌గా.. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ యూనివర్శిటీ పరిశోధకులు.. రాత్రివేళ కూడా సోలార్ పవర్ జనరేట్ చేసి చూపించారు. ఇందుకోసం.. వాళ్లు భూమి నుంచి వచ్చే ఇన్‌ఫ్రారెడ్ థర్మల్ రేడియేషన్‌ను ఉపయోగించారు.
నిజానికి ఇన్‌ఫ్రారెడ్ థెర్మల్ రేడియేషన్ అనేది.. సూర్యుడి నుంచి వచ్చే ఎనర్జీయే. పగటి పూట ఈ ఎనర్జీ కారణంగా.. భూమి వేడెక్కుతుంది. రాత్రివేళ ఇదే ఎనర్జీని తిరిగి ఆకాశంలోకి వదిలేస్తుంది భూమి. అలా.. ఆకాశంలోకి వెళ్లిపోయే ఎనర్జీని.. ఓ ప్రత్యేక పరికరాన్ని ఉపయోగించి.. సోలార్ పవర్‌గా మార్చడంలో సక్సెస్ అయ్యారు ఆస్ట్రేలియా పరిశోధకులు. ఆ పరికరం పేరే.. థర్మో రేడియేటివ్ డయోడ్.
రాత్రి పూట చూసేందుకు వీలయ్యే కళ్లద్దాల తయారీకి వాడే మెటీరియల్‌తోనే.. ఈ థర్మో రేడియేటివ్ డయోడ్‌ని తయారుచేశారు. దీని ద్వారా సోలార్ పవర్ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ రీసెర్చ్‌కు సంబంధించిన వివరాలను.. ఏసీఎస్ ఫోటోనిక్స్ జర్నల్‌లో తెలిపారు. సోలార్ పవర్ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తి అయ్యే పవర్‌తో పోల్చితే.. థర్మో రేడియేటివ్ డయోడ్ ద్వారా ఉత్పత్తి అయ్యే పవర్.. చాలా రెట్లు తక్కువ. ఐతే.. ఈ అంశంపై మున్ముందు మరిన్ని మెరుగైన ప్రయోగాలు చేయడం ద్వారా.. భవిష్యత్తులో రాత్రివేళ కూడా భారీగా సోలార్ పవర్‌ని ఉత్పత్తి చేసే ఆలోచనలో ఉన్నారు శాస్త్రవేత్తలు.
Also read : 1955 Mercedes-Benz..300 SLR : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు..ధర రూ.1100 కోట్లు..!!
థర్మల్ ఇమేజింగ్ కెమెరాలతో.. రాత్రివేళ ఎంత రేడియేషన్ ఉందో చూడగలరు. అది తరంగాల రూపంలో కాకుండా.. ఇన్‌ఫ్రారెడ్‌లో కనిపిస్తుందని.. ఈ రీసెర్చ్‌ని ముందుకు నడిపిస్తున్న ప్రొఫెసర్ నెడ్ ఎకిన్స్ డాక్స్ తెలిపారు. ఈ పరిశోధన ద్వారా.. భూమి నుంచి రోజూ ఆకాశంలోకి వృథాగా పోతున్న రేడియేషన్‌ను.. సోలార్ పవర్‌గా మార్చేందుకు వీలు కానుంది. ఈ టెక్నాలజీ.. భారత్ లాంటి దేశాలకు చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ.. ఎండలు ఎక్కువ కాబట్టి.. రాత్రివేళ భూమి చాలా వేడిగా ఉంటుంది. ఇప్పటికే సోలార్ పవర్ ఉత్పత్తిలో ఇండియా దూసుకుపోతోంది. త్వరలో రాత్రివేళ కూడా సోలార్ పవర్‌ని ఉత్పత్తి చేస్తే.. అది దేశానికి బాగా ఉపయోగపడుతుంది.
- Australia pm Anthony Albanese : పేదరికంలో పుట్టిపెరిగిన ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్..పెన్షన్ డబ్బులతో పెంచి పెద్దచేసిన తల్లి
- Zelensky On Australia : మీ సాయం మరువం, పుస్తకాల్లో రాసుకుంటాం- జెలెన్ స్కీ
- Russia Ukraine War : రష్యాకు షాకిచ్చిన ఆస్ట్రేలియా.. 14 రష్యన్ కంపెనీలపై ఆంక్షలు..
- Russia : నాపైనే ఆంక్షలు విధిస్తారా.. ఆస్ట్రేలియా, న్యూజిల్యాడ్ ప్రధానులకు షాకిచ్చిన పుతిన్
- India-Australia: భారత్ – ఆస్ట్రేలియా మధ్య కీలక ఒప్పందాలు: వాణిజ్య, వృత్తి, విద్యా విసాలు సులభతరం
1Agnipath: ‘అగ్నిపథ్’ కింద వైమానిక దళంలో ఉద్యోగాలకు 6 రోజుల్లో 2 లక్షల దరఖాస్తులు
2Andhra pradesh : నా కార్యకర్తలను అప్పుల పాలు చేశా..పార్టీ ఆదుకోవాలి : వైసీపీ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు
3Pushpa : పుష్ప సినిమా మాదిరి తగ్గేదేలే అన్నాడు..షాకిచ్చిన పోలీసులు
4Telangana: అందుకే కేసీఆర్ భయపడిపోయి బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు: రాజా సింగ్
5Russia – Ukraine War: పుతిన్ మహిళ అయి ఉంటే యుద్ధం ఉండేది కాదు – ప్రధాని
6Eknath Shinde: బల పరీక్షపై ఆందోళన లేదు.. గెలుపు మాదే: ఏక్నాథ్ షిండే
7Chhattisgarh: సర్పంచ్ ఇంట్లోకి వెళ్ళి దారుణంగా చంపేసిన నక్సలైట్లు
8Sharwanand: శర్వానంద్ రేర్ ఫీట్.. ఏకంగా మిలియన్!
9Colombia : కొలంబియా జైలులో నిప్పు పెట్టిన ఖైదీలు..51 మంది మృతి
10Better Sleep: ప్రశాంతమైన నిద్ర కోసం బెస్ట్ ఎక్సర్సైజులు
-
Vikram: ఓటీటీలోకి వచ్చేస్తున్న విక్రమ్.. రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Period Tracking Apps : అమెరికాలో మహిళలు.. ఫోన్లలో పీరియడ్ ట్రాకింగ్ యాప్స్ డిలీట్ చేస్తున్నారు.. ఎందుకంటే?
-
Moto G42 India : మోటో G42 లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Google Hangouts : వచ్చే నవంబర్‌లో హ్యాంగౌట్స్ షట్‌డౌన్.. గూగుల్ చాట్‌కు మారిపోండి..!
-
Pakka Commercial: పక్కా కమర్షియల్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
-
Lokesh Kanagaraj: విజయ్ కోసం మకాం అక్కడికి మారుస్తున్న లోకేశ్..?
-
Tesla Employees : టెస్లా ఉద్యోగుల కష్టాలు.. ఆఫీసుకు రావాల్సిందే.. వస్తే కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేవట..!
-
Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..అడగకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ