అత్యంత కారంగా ఉండే మిరపకాయలని తినేశాడు..ఇదొక రికార్డు

carolina reaper chilli : ఏదో ఒక పని చేస్తూ రికార్డులు బద్దలు కొడుతుంటారు. ఒకరు బరువులు లేపడంలో, మరొకరు తినడంలో..ఇంకొకరు..మరో పని చేస్తూ..చరిత్ర సృష్టిస్తుంటారు. ప్రధానంగా..గిన్నిస్ బుక్ రికార్డులోకి తమ పేరు నమోదు కావాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ..సక్సెస్ సాధిస్తారు. ఇలాగే..ఓ వ్యక్తి కొత్త రికార్డును నెలకొల్పాడు. ప్రపంచంలో అత్యంత కారంగా పేరు గడించిన ‘కరోలినా రీపర్’ ను తినేశాడు. ఒకటి కాదు..ఏకంగా..మూడు నోట్లో బరబరా నమిలి మింగేయడంతో అందరూ షాకింగ్ కు గురయ్యారు.

కెనాడాకు చెందిన మైక్ జాక్ ఈ రికార్డును నెలకొల్పాడు. కరోలినా రీపర్ మిరపకాయలను మూడింటిని అవలీలగా తినేసి అందరి చేత ఔరా అనిపించాడు. మైక్ కేవలం 10 సెకన్లలో వీటిని నమిలి మింగేశాడు. దీంతో ఇప్పటి వరకు గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డ్స్ లో ఉన్న రికార్డులను అధిగమించి..కొత్త రికార్డును సృష్టించాడు. 8 రీపర్ మిరపకాయలు తిని..రికార్డు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు మైక్. ఇతడి స్టంట్ చూసిన వాళ్లు..గిదేంది.. బతకాలని లేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కరోలినా రీపర్ అంటే…ఈ మిరపకాయ..ప్రపంచంలోనే అత్యంత కారంగా..ఉంటుంది. ఒక్కో మిరపకాయ దాదాపు 5 గ్రాముల బరువు ఉంటుంది. క్యాప్సికమ్ లాగా కనిపిస్తుంది. దీని నుంచి సగటున 15,69,300 స్కొవిల్ స్కేల్ యూనిట్స్ (SHU) ఉత్పత్తి అవుతాయి. 2013లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అత్యంత ఘాటైన మిరపగా పేర్కొంది.
గతంలో మిరపకాయల పోటీ జరిగింది. ఇందులో కరోలినా రీపర్ కూడా ఉంది. న్యూయార్క్ ప్రాంతానికి చెందిన 34 సంవత్సరాలు కలిగిన వ్యక్తి దీనిని తిని మింగేశాడు. అనంతరం వికారం, తీవ్రమైన తలనొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు.